Murder : పెళ్లి చేయమని అడిగిన తమ్ముడిని హత్య చేసిన అన్న

తమ్ముడు పెళ్లి చేయమని అనడంతో అన్నదమ్ముల మధ్య గొడవ మొదలైంది. తమ్ముడు అడిగినట్లు పెళ్లి చేయకపోగా ప్రతిసారి పెళ్లి ప్రస్తావన తెస్తుండటం ఏ మాత్రం నచ్చని ఆ అన్న.. తమ్ముడిని హత్య చేశాడు.

Murder : పెళ్లి చేయమని అడిగిన తమ్ముడిని హత్య చేసిన అన్న

Murder

Elder brother murdered younger brother : పెళ్లి ప్రస్తావన ఓ యువకుడి చావుకొచ్చింది. తనకు పెళ్లి చేయాలంటూ ఇంట్లో వాళ్లని అడగడమే శాపమైంది. పెళ్లి విషయం గొడవ వరకు వెళ్లడం.. అది హత్యకు దారి తీయడం కలకలం రేపుతోంది. కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌లో దారుణం చోటు చేసుకుంది.

తమ్ముడు పెళ్లి చేయమని అనడంతో అన్నదమ్ములు మధ్య గొడవ మొదలైంది. తమ్ముడు అడిగినట్లు పెళ్లి చేయకపోగా.. ప్రతిసారి పెళ్లి ప్రస్తావన తెస్తుండటం ఏ మాత్రం నచ్చని ఆ అన్న.. తమ్ముడిని కానరాని లోకాలకు పంపించేశాడు.

Sitaram Yechury : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసగించిన కేంద్రం : సీతారాం ఏచూరి

కాగజ్‌నగర్‌కు చెందిన రాజు, వెంకటేశ్‌ అన్మదమ్ములు. రాజు కాగజ్‌నగర్‌లోని ఇంట్లోనే నివాసం ఉంటుండగా.. అతని తమ్ముడు వెంకటేశ్‌ మాత్రం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఉంటున్నాడు. నిన్ననే ఇంటికి వచ్చిన వెంకటేశ్‌.. తనకు పెళ్లి చేయాలంటూ రాజుతో గొడవపడ్డాడు. అన్నదమ్ముల మధ్య మాటామాటా పెరిగింది.

దీంతో.. తమ్ముడిపై కోపం పెంచుకున్న రాజు.. వెంకటేశ్‌ నిద్రిస్తున్న సమయంలో కర్రతో తలపై బలంగా కొట్టాడు. దీంతో స్పాట్‌లోనే వెంకటేశ్‌ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.