Electricity Consumption Increased : తెలంగాణలో భారీగా విద్యుత్ వినియోగం.. వరినాట్లు పెరగటమే కారణం!
తెలంగాణలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. రాష్ట్రంలో డిసెంబర్ 13 వేల మెగావాట్లకు పైగా విద్యుత్ ను వినియోగించినట్లు అధికారులు పేర్కొన్నారు.

Electricity consumption
Electricity consumption increased : తెలంగాణలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. రాష్ట్రంలో డిసెంబర్ 13 వేల మెగావాట్లకు పైగా విద్యుత్ ను వినియోగించినట్లు అధికారులు పేర్కొన్నారు. రికార్డు స్థాయిలో ఉదయం 8 గంటలకు 13,403 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరిగిందని తెలిపారు.
డిసెంబర్ లో ఇంత పెద్ద మొత్తంలో ఎన్నడూ లేదని అధికారులు చెప్పారు. రాష్ట్రంంలో వరినాట్లు పెరగటమే విద్యుత్ వినియోగం పెరగటానికి కారణమని తెలిపారు. నిరంతర విద్యుత్ సరఫరాతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని అధికారులు పేర్కొన్నారు.
Telangana Electricity : తెలంగాణలో పెరుగుతున్న విద్యుత్ వినియోగం..రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక డిమాండ్
వేసవిలో 15 వేల మెగావాట్ల విద్యుత్ వరకు డిమాండ్ వచ్చే అవకాశం ఉంటుందని అధికారుల అంచనా. డిమాండ్ పెరిగినా నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.