దిశ నిందితుల ఎన్ కౌంటర్ : పోలీసులకు రాఖీలు కట్టిన మహిళలు 

  • Published By: veegamteam ,Published On : December 6, 2019 / 06:53 AM IST
దిశ నిందితుల ఎన్ కౌంటర్ : పోలీసులకు రాఖీలు కట్టిన మహిళలు 

దిశ నిందితుల ఎన్ కౌంటర్ చేయటంపై హర్షం వ్యక్తమవుతోంది. దిశపై హత్యాచారం ఘటన తరువాత దుర్మార్గులపై తీవ్రమైన ఆగ్రహావేశాలు కలిగిన ప్రజలు నిందితుల ఎన్ కౌంటర్ తరువాత పోలీసులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాదు పోలీసులకు రాఖీలు కట్టి సోదరా..మాకు మీరున్నారనే ధైర్యాన్ని కల్పించారు అంటూ మహిళలంతా పోలీసులకు రాఖీలు కట్టారు.

మహిళలతో పాటు పలువురు పురుషులు కూడా ;పోలీసులపై పూల జల్లు కురిపించారు. రాఖీ అంటే తోడబుట్టిన అక్క చెల్లెళ్లకు మేము తోడుగా ఉన్నాం..అండగా ఉన్నాం..మీకు ఏ కష్టమొచ్చినా మీకు మేమున్నాం అనే ధైర్యాన్నిచ్చేభరోసా.ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చి రాఖీ మూవీ కూడా ఆడపడుచులపై జరిగే అన్యాయాలకు.. అత్యాచారాలకుసంబంధించినదే. ఆడవారిపై అత్యాచారానికి పాల్పడిన దుర్మార్గులను హీరో ఎన్టీఆర్ చంపేస్తాడు.

యువతులు, మహిళలు ఎన్టీఆర్ కు రాఖీలు కట్టి..అన్నా మీ వల్లనే మేము ధైర్యంగా తిరగలుగుతున్నామని చెబుతారు. అలాగే దిశ నిందుతుల్ని ఎన్ కౌంటర్ చేసిన పోలీసుల్ని కూడా మహిళలు తమ సోదరుగా భావించి రాఖీలు కట్టి తమ కృతజ్ఞతలు తెలిపారు.  నిందితుల్ని ఎన్ కౌంటర్ చేసిన తరువాత వారికి మహిళలు రాఖీలు కట్టి తమ కృతజ్ఞతలు తెలిపారు.

కామాంధుల చేతుల్లో బలైపోయిన దిశ ఘటన యావత్ దేశాన్ని కదిలించింది. తెలంగాణలో జరిగిన ఈ దారుణంపై దేశం యావత్తు కన్నీరు పెట్టింది. 10 రోజుల క్రితం జరిగిన ఈ కిరాతక చర్యకు దేశ ప్రజలంతా నిందితుల్ని దారుణంగా చంపాలనీ..ఉరి తీయాలనీ..దిశను చంపినచోటే..ఆమెను చంపినట్లే చంపాలనే డిమాండ్లు వినిపించాయి.

దిశ ఘటనతో యువతులు..మహిళలతో పాటు పురుషులు కూడా  తీవ్ర ఆగ్రహావేశాల్ని వ్యక్తంచేశారు. ఇటువంటి మావన మృగాలు సమాజంలో బ్రతకటానికి వీల్లేదని..ఇటువంటివారిని జైళ్లలో పెట్టి పోషించటం..విచారణ పేరుతో కాలయాపన చేయవద్దని ఎన్ కౌంటర్ చేయాలని సమాజం నుంచి తీవ్రమైన ఒత్తిడి వచ్చింది.

దీంతో దిశ ఘటన జరిగిన సరిగ్గా 10 రోజులకు నిందుతులు నలుగురిని పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. దీంతో సామాన్య ప్రజల నుంచే కాక సెలబ్రిటీలు..ప్రజా ప్రతినిథులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.