Peddi Reddy TRS : ముహూర్తం ఫిక్స్, టీఆర్ఎస్‌‌లోకి పెద్దిరెడ్డి

మాజీ మంత్రి పెద్దిరెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ముహుర్తం ఫిక్స్‌ అయింది. 2021, జూలై 30వ తేదీ శుక్రవారం ఆయన గులాబీ బాస్‌ సమక్షంలో కారెక్కనున్నారు. పార్టీ మారడంపై.. స్వయంగా పెద్దిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. శుక్రవారం సాయంత్రం సీఎం కేసీఆర్‌ సమక్షంలో పార్టీలో చేరతానన్నారు మాజీ బీజేపీ నేత.

Peddi Reddy TRS : ముహూర్తం ఫిక్స్, టీఆర్ఎస్‌‌లోకి పెద్దిరెడ్డి

Peddireddy

Enugula Peddi Reddy : మాజీ మంత్రి పెద్దిరెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ముహుర్తం ఫిక్స్‌ అయింది. 2021, జూలై 30వ తేదీ శుక్రవారం ఆయన గులాబీ బాస్‌ సమక్షంలో కారెక్కనున్నారు. పార్టీ మారడంపై.. స్వయంగా పెద్దిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. శుక్రవారం సాయంత్రం సీఎం కేసీఆర్‌ సమక్షంలో పార్టీలో చేరతానన్నారు మాజీ బీజేపీ నేత. హుజూరాబాద్‌ను జిల్లా చేయడం కోసం ప్రయత్నిస్తే తప్పకుండా జరిగేదన్నారు మాజీ బీజేపీ నేత పెద్దిరెడ్డి. ప్రభుత్వానికి అనుకూలమైన అభ్యర్థిని ఎన్నుకుంటే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. తనకు రాజకీయ జీవతం ప్రసాదించింది హుజూరాబాద్ ప్రజలేనని పెద్దిరెడ్డి వెల్లడించారు.

Read More : Women Pickpockets : కిలాడీ లేడీలు…మాటలు కలిపి డబ్బులు కొట్టేస్తూ….

హుజూరాబాద్ టికెట్ : –
హుజురాబాద్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన పెద్దిరెడ్డి…మాజీ మంత్రి ఈటల రాజేందర్ పార్టీలో చేరికను ఆయన వ్యతిరేకించారు. రాజేందర్ బీజేపీలో చేరినప్పటి నుంచి ఆయన అసంతృప్తిగా ఉండగా.. అప్పటి నుండే బీజేపీలో ఇమడలేకపోతున్నామనే భావనలో పెద్దిరెడ్డి ఉన్నట్లు రాజకీయ వర్గాలలో వినిపించింది. ఈటల చేరిన సమయం నుండే పెద్దిరెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తుండగా ఆయన పార్టీకి గుడ్ బై చెప్పనున్నారనే ప్రచారం కూడా జరుగుతూ వచ్చింది.

Read More : Guntur : విషాదం.. విద్యుత్ షాక్‌తో ఆరుగురు మృతి

తెలంగాణలో టీడీపీ ఉనికి : –
చివరికి ఆయన పార్టీని వీడుతున్నట్లుగా ప్రకటించారు. పెద్దిరెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీలో మంత్రిగా పని చేయగా.. టీడీపీలో ఉన్నంత కాలం కరీంనగర్ జిల్లాలో ఆయన బలమైన నాయకుడిగా ఒక వెలుగు వెలిగారు. తెలంగాణలో టీడీపీ ఉనికి ప్రశ్నార్థంగా మారిన నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరగా.. ఈటల కమలం గూటికి చేరడంతో పెద్దిరెడ్డి కినుకు వహించినట్లుగా కనిపించింది.

Read More : Olympic : క్వార్టర్‌ ఫైనల్‌కు చేరిన భారత హాకీ టీం

మరోవైపు…

హుజూరాబాద్‌ హీటెక్కుతోంది. బీజేపీ, టీఆర్ఎస్ నేతల పోటాపోటీ బలప్రదర్శనకు వేదికవుతోంది. ఇప్పటికే అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగా.. తాజాగా ఇరువర్గాల ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈటల బావమరిది చేశాడంటూ వచ్చిన వాఖ్యలు నియోజకర్గంలో దుమారం లేపాయి. దీంతో.. ఆయన దళితులను కించపరిచినట్టుగా ఉన్నాయని.. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ… ఈటల దిష్టిబొమ్మను దగ్గం చేశారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా వాట్సప్.. వ్యవహారంపై టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది దళితులు ఈటల దిష్టిబొమ్మను దహనం చేశారు.