Neelakanteshwara Temple pushkarini : నీలకంఠేశ్వర స్వామి వారి పుష్కరిణిలో ఈవో జలకాలాటలు .. భక్తుల ఆగ్రహం

ఆలయ పుష్కరిణిలో ఓపక్క స్వామివారికి అభిషేకం చేస్తుండగా..మరోపక్క ఆలయ ఈవో జలకాలాటాలు ఆడారు. దీంతో భక్తులు మండిపడుతున్నారు. స్వామివారి ఆలయంలో ఇటువంటి అపచారాలకు పాల్పడిన ఈవోపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Neelakanteshwara Temple pushkarini : నీలకంఠేశ్వర స్వామి వారి పుష్కరిణిలో ఈవో జలకాలాటలు .. భక్తుల ఆగ్రహం

EO swimming In neelakantheswara swami pushkarini

Neelakanteshwara Temple pushkarini – EO swimming: నిజామాబాద్ లో కొలువైన నీలకంఠేశ్వర స్వామివారి ఆలయంలో అపచారం చోటుచేసుకుంది. ఆలయ ఈవో అతిగా ప్రవర్తించి స్వామివారికి పుష్కరిణిలో ఈవో ఈత కొట్టటం వివాదంగా మారింది. ఆలయ అర్చకులు స్వామివారి విగ్రహాలకు పుష్కరిణిలో అభిషేకం చేస్తుండగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈవో వేణు అక్కడే ఈతలు కొట్టారు. దీంతో అర్చకులు వారించారు. అపచారం అలా చేయకూడదని పదే పదే చెప్పినా ఈవో వేణు మాత్రం ఏదో స్విమ్మింగ్ పూల్లో ఈతలు కొట్టినట్లుగా జలకాలాటలు ఆడటం వివాదంగా మారింది.

స్వామివారి పుష్కరిణిలో ఓ పక్కన స్వామివారికి అర్చకులు వేద మంత్రాలతో అభిషేకం నిర్వహిస్తున్నారు. మరోపక్క ఈవో వేణు పక్కే ఈతలు కొట్టారు. దీంతో అర్చకులు వారించారు. అయినా ఈవో వినకుండా ఈతలు కొట్టటంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి వ్యక్తులు ఆలయం పదవుల్లో ఉండటం అపచారం అని ఈవో వేణులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈవో వేణు స్వామివారి పుష్కరిణిలో జలకాలాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో భక్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈవోపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

హిందూ సంఘాల ఆందోళన
నీలకంఠేశ్వర స్వామివారి ఆలయ నిర్వాహాణాధికారి వేణు తీరుకు నిరసనగా హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. ఆలయ పవిత్రతను దెబ్బతీసిన అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. దీంతో
స్పందించిన దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించారు.