Oxygen Tanker : ఆక్సిజన్ ట్యాంకర్ తరలించేందుకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు

ఆక్సిజన్ సరఫరాలో ఆలస్యంగా కారణంగా కరోనా బాధితుల ప్రాణాలు పోతున్న ఘటనలు ఎన్నో చూస్తున్నాం. ఆక్సిజన్ ట్యాంకర్లు సరైనా సమయానికి ఆస్పత్రులకు చేరుకోకపోవడం వల్ల కరోనా పేషెంట్లు అల్లాడిపోతున్నారు.

Oxygen Tanker : ఆక్సిజన్ ట్యాంకర్ తరలించేందుకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు

Green Chanel

green channel : ఆక్సిజన్ సరఫరాలో ఆలస్యంగా కారణంగా కరోనా బాధితుల ప్రాణాలు పోతున్న ఘటనలు ఎన్నో చూస్తున్నాం. ఆక్సిజన్ ట్యాంకర్లు సరైనా సమయానికి ఆస్పత్రులకు చేరుకోకపోవడం వల్ల కరోనా పేషెంట్లు అల్లాడిపోతున్నారు. ఇలాంటి సమస్యను అధిగమించేందుకు హైదరాబాద్ పోలీసులు…ఆక్సిజన్‌ ట్యాంకర్‌ను గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి మరీ ఆస్పత్రికి చేర్చారు.

హైదరాబాద్‌ దిల్‌ సుఖ్ నగర్‌ నుంచి కింగ్ కోఠి ఆస్పత్రి వరకూ గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి..ఆక్సిజన్ ట్యాంకర్‌ను వేగంగా చేర్చగలిగారు. ఆక్సిజన్ ట్యాంకర్‌కు ముందు వెనుక పోలీసు ఎస్కార్ట్‌ను కూడా ఏర్పాటు చేశారు. రోడ్డుపై ట్రాఫిక్ లేకుండా చూస్తూ… సుమారు 8 కిలో మీటర్ల దూరాన్ని 9 నిమిషాల్లో చేరుకున్నారు. ఆక్సిజన్ ట్యాంకర్ ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా అడుగడుగునా జాగ్రత్తలు తీసుకున్నారు.

ఈ నెల 9న హైదరాబాద్ కింగ్ కోఠి ఆస్పత్రిలో విషాదం చోటు చేసుకుంది. ఆక్సిజన్ అందక ముగ్గురు కరోనా పేషెంట్లు మృతి చెందారు. మరో 20 మంది ఆక్సిజన్ అందక ఇబ్బందిపడ్డారు. జడ్చర్ల నుంచి కోఠి ఆస్పత్రికి రావాల్సిన ఆక్సిజన్ ట్యాంకర్ ఇంకా రాకపోవడం వల్లే విషాదం చోటు చేసుకుంది. డ్రైవర్ దారి మరిచిపోవడంతో ఆక్సిజన్ సరఫరా ఆలస్యమైనట్లు అధికారులు చెబుతున్నారు.

ఆక్సిజన్ అయిపోయే వరకూ అధికారులు పట్టించుకోలేదు. చివరి నిమిషం వరకూ అధికారులు గుర్తించలేదు. అధికారుల నిర్లక్ష్యం ముగ్గురు ప్రాణాలను బలి తీసుకుంది. కింగ్ కోఠి ఆస్పత్రిలో ఆక్సిజన్ అయిపోవడంతో చికిత్స పొందుతున్న కరోనా బాధితులు విలవిలలాడారు. ఆక్సిజన్ అయిపోయిన విషయం చివరి వరకు గమనించని అధికారులు ఒక్కసారిగా ఉరుకులు పరుగులు పెట్టారు. ఈ లోగానే ముగ్గురు ప్రాణం కోల్పోయారు.