Etala Rajender : పాదయాత్రలో అడ్డంకులు సృష్టిస్తున్నారు.. భోజన విరామం కోసం బుక్ చేసుకున్న రైస్ మిల్లును సీజ్ చేశారు – ఈటల

మాజీ మంత్రి.. బీజేపీ నేత ఈటల రాజేందర్ పాదయాత్ర ప్రారంభమైంది. ఈ సందర్బంగా ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. అనుమతులు తీసుకున్నా పాదయాత్రకు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం భోజన విరామం కోసం బుక్ చేసుకున్న రైస్ మిల్లును అధికారులు సీజ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Etala Rajender : పాదయాత్రలో అడ్డంకులు సృష్టిస్తున్నారు.. భోజన విరామం కోసం బుక్ చేసుకున్న రైస్ మిల్లును సీజ్ చేశారు – ఈటల

Etala Rajender

Etala Rajender : మాజీ ఎమ్మెల్యే.. బీజేపీ నేత ఈటల రాజేందర్ పాదయాత్ర సోమవారం ఉదయం 9గంటల 30నిమిషాలకు ప్రారంభమైంది. కమలాపూర్ మండలం బత్తినివాని పల్లి నుంచి ఈటల తన పాదయాత్రను మొదలు పెట్టారు. ముందుగా బత్తినివానీపల్లిలోని ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పాదయాత్ర ప్రారంభించారు.

పాదయాత్రలో రాజేందర్ తోపాటు మాజీ ఎంపీ వినోద్ వున్నారు. 107 గ్రామపంచాయితీల పరిధిలోని 127 గ్రామాల్లో 270 కిలోమీటర్ల దూరం వెళ్లాలని ప్లాన్ చేశారు. 23 రోజులపాటు ఈ పాదయాత్ర సాగనుంది. ఇక ఈ నేపథ్యంలోనే ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు.. తన పాదయాత్రను అడ్డుకునేందుకు కుట్ర జరుగుతుందని ఆరోపించారు. అధికారులు ప్రజాస్వామ్యబద్దంగా వ్యవహరించడం లేదని వ్యాఖ్యానించారు ఈటల.

పాదయాత్రకు అనుమతులు తీసుకున్నా అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఓడిపోతామనే భయంతోనే అడ్డంకులు సృష్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. తాము మధ్యాహ్న భోజనం కోసం ఓ రైస్ మిల్లులో ఏర్పాట్లు చేసుకుంటుంటే రైస్ మిల్ యజమానులను భయపెట్టి తమ వంట సరుకులను సీజ్ చేశారని తెలిపారు.

కేసీఆర్ కనుసన్నల్లో, పరకాల ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అప్రజాస్వామిక పనులకు తెరలేపారని అన్నారు. తనకు నియోజకవర్గ ప్రజల అశీసులు ఉన్నాయని తెలిపారు. ఇది భారతీయ జనతాపార్టీ పాదయాత్ర అని టీఆర్ఎస్ పాదయాత్ర కాదని ఈటల అన్నారు.