Huzurabad : ఈటలకు చేదు అనుభవం.. ఓ తల్లి శాపనార్థాలు

హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ కు చేదు అనుభవం ఎదురైంది. పెద్దపాపయ్యపల్లిలో ఓ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఈటల వెళ్లారు.

Huzurabad : ఈటలకు చేదు అనుభవం.. ఓ తల్లి శాపనార్థాలు

Etela

Etela Rajender : హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ కు చేదు అనుభవం ఎదురైంది. పెద్దపాపయ్యపల్లిలో ఓ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఈటల వెళ్లారు. అయితే..ఆ కుటుంబం ఊహించని షాక్ ఇచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్న ప్రవీణ్ యాదవ్ కొంతకాలం క్రితం గుండెపోటుతో చనిపోయాడు. దీంతో ప్రవీణ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఈటల 2021, సెప్టెంబర్ 29వ తేదీ బుధవారం పెద్దపాపయ్యపల్లి గ్రామానికి వెళ్లారు. ఈటలను చూడగానే..ప్రవీణ్ కుటుంబసభ్యులు తిట్లదండకం మొదలుపెట్టారు.

Read More : Amazon Sale : OnePlus 9 సిరీస్ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!

తన కొడుకు చనిపోవడానికి నువ్వే కారణమంటూ..తల్లి శాపనార్ధాలు పెట్టింది. దీంతో ఈటల షాక్ కు గురయ్యారు. ఎందుకు వచ్చావంటూ..తండ్రి నిలదీయడంతో ఏమి చేయలేక..ఈటెల వెనుదిరిగారు. ఆయనను వదలకుండా..కారు వరకు ఆ కుటుంబసభ్యులు రావడంతో కొంత టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఏమి మాట్లాడకుండా…కారులో ఎక్కి వెళ్లిపోయారు ఈటల. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Read More : Vijayawada : దుర్గగుడి ఫ్లై ఓవర్‌‌పై యువకుల యాక్షన్, పోలీసుల రియాక్షన్

మరోవైపు..హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల కావడంతో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరంగా చేపట్టారు. పోటాపోటీగా నేతలు ప్రచారం చేపడుతున్నారు. తమ పార్టీయే గెలుస్తందంటూ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నేతల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. అక్టోబర్‌ 30న ఈ రెండు నియోజక వర్గాలకు ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అక్టోబర్ 8వరకు నామినేషన్ దాఖలుకు చివరి తేదీగా నిర్ణయించారు. అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 13గా ప్రకటించింది. అక్టోబర్ 30వ తేదీన ఎన్నికల నిర్వహించి నవంబర్ 2వ తేదీ ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలను ప్రకటిస్తారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారికంగా షెడ్యూల్‌ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాలలోని 30 అసెంబ్లీ నియోజకవర్గాలకు, మూడు లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నిక నిర్వహించనున్నారు.