Etela Rajender: కేసీఆర్.. తక్షణమే ఆ జీవోను వెనక్కు తీసుకో.. అభివృద్ధి చాటున పర్యావరణ విధ్వంసం చేస్తారా.?

ఎల్లమ్మ బండ భూములు, మియాపూర్ భూముల స్కాం ఎందుకు బయట పెడతలేదు కేసీఆర్ అంటూ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రశ్నించారు.

Etela Rajender: కేసీఆర్.. తక్షణమే ఆ జీవోను వెనక్కు తీసుకో.. అభివృద్ధి చాటున పర్యావరణ విధ్వంసం చేస్తారా.?

Etela Rajender,

Etela Rajender: తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ అనేక మాటలు చెప్పిండు.. ఆనాడు 111 జీవోలో ఉన్న భూములు ఆంధ్ర వ్యాపారులు కొల్లగొడుతున్నారని చెప్పిండు.. కానీ.. ఇప్పుడు హైదరాబాద్ అభివృద్ధి మాటున రైతుల పొట్టగొడుతూ 111 జీవోను కేసీఆర్ రద్దు చేసిండు అంటూ బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. శామీర్ పేట్‌లోని తన నివాసంలో ఈటల మీడియాతో మాట్లాడారు.. 1908 – 1927 మధ్య కాలంలో రెండు జలాశయాలు నిర్మాణం జరిగింది. రెండు జలాశయాలతో సాగు, తాగు నీరు అందాయి. గొప్ప లక్ష్యంతో ఆనాడు నిజాం సర్కార్ జలాశయాలను నిర్మించింది. కేసీఆర్ మేధస్సుతో నిర్మించిన కాళేశ్వరం మోటర్లు మునిగిపోయే పరిస్థితి ఎందుకు వచ్చిందని ఈటల ప్రశ్నించారు.

Etela Rajender: నాకు ఫ్రస్టేషన్ రాదు.. డ్రామాలు రావు: ఈటల రాజేందర్

111 జీవో రద్దుతో రియల్ ఎస్టేట్ మాఫియా పెరిగిపోయే ప్రమాదం ఉంది. 1.32 లక్షల ఎకరాల్లో 18వేల ఎకరాల అసైన్డ్ భూములు ఉన్నాయి. అభివృద్ధి చాటున పర్యావరణ విధ్వంసం చేస్తారా కేసీఆర్ అంటూ ఈటల ప్రశ్నించారు. మీ తీరుతో హైదరబాద్ కాంక్రీట్ జంగిల్ కాబోతోంది. వరదలు వస్తె పడవలేసుకుని తిరిగే పరిస్థితులు ఉన్నాయి. వెంటనే 111జీవో రద్దును విరమించుకోవాలి. వరదలకు అస్కారం లేకుండా జంట జలాశయాలకు విఘాతం కలగకుండా రైతులకు మేలు చేసే విధంగా పాలన ఉండాలని ఈటల కేసీఆర్ కు సూచించారు.

CM KCR : JPSలకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్.. పర్మినెంట్ చేసేందుకు గ్రీన్‌సిగ్నల్, విధివిధానాలకు ఆదేశం

కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి రైతుల కొంపలు ముంచింది. ధరణి సమస్యల వల్ల రైతులు ఆగం అవుతున్నారు. ధరణిలో 18లక్షల మంది దరఖాస్తులు పెట్టుకున్నారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ పేదలకు సెంటు భూమి ఇవ్వాలేదు. రింగ్ రోడ్ చుట్టుపక్కల ఉన్న దళిత రైతుల 5800 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నారు. ఎకరాకు 300 గజాలు ఇచ్చి పేదల భూములను లాక్కున్నారు. కోర్టులకు పోలేక రైతులు బ్రోకర్లకు భూములు అమ్ముకునే పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయని ఈటల అన్నారు.

Etela Rajender: గుళ్లకు వెళ్లి.. అమ్మ తోడు, అయ్య తోడు అనడం ఏంటీ?: స్పందించిన ఈటల

ఎల్లమ్మ బండ భూములు, మియాపూర్ భూముల స్కాం ఎందుకు భయట పెడతలేదు కేసీఆర్ అంటూ ఈటల ప్రశ్నించారు. తెలంగాణ సొమ్ముతో కేసీఆర్ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ సొమ్ముతోనే కేసీఆర్ మహారాష్ట్రలో రాజకీయాలు చేస్తున్నాడంటూ ఈటల ఆరోపించారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన సచివాలయంలో ప్రతినిధులకు స్థానం లేదు, మీడియాకు స్థానం లేదు. ఇది ప్రజాస్వామ్యమా లేక రాజరిక వ్యవస్థనా కేసీఆర్ అంటూ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.