Eatala Rajender : నన్ను చంపటానికి ఓ మంత్రి హంతక ముఠాను సంప్రదించారు-ఈటల

అరె కొడుకుల్లారా ఖబర్దార్..? నరహంతకుడు నయిం చంపుతా అంటేనే భయపడలేదు.. మీ చిల్లర ప్రయత్నాలకు అసలు భయపడను... ఉగ్గుపాలతో ఉద్యమాలు చేసిన వాడిని, ఈటల మల్లయ్య కొడుకుని ఆత్మగౌరవం కోసం ఏ స్థాయిలో అయినా కొట్లడతా..

Eatala Rajender : నన్ను చంపటానికి ఓ మంత్రి హంతక ముఠాను సంప్రదించారు-ఈటల

Eatala Rajender

Eatala Rajender : తనను చంపటానికి కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక మంత్రి హంతక ముఠాలతో సంప్రదింపులు చేస్తున్నారని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా ప్రజాదీవెన యాత్ర పేరుతో ఈరోజు నుంచి ఆయన హుజూరాబాద్ నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ….‘అరె కొడుకుల్లారా ఖబర్దార్..? నరహంతకుడు నయిం చంపుతా అంటేనే భయపడలేదు.. మీ చిల్లర ప్రయత్నాలకు అసలు భయపడను… ఉగ్గుపాలతో ఉద్యమాలు చేసిన వాడిని, ఈటల మల్లయ్య కొడుకుని ఆత్మగౌరవం కోసం ఏ స్థాయిలో అయినా కొట్లడతా.. దుబ్బాకలో ఎం జరిగిందో అదే ఇక్కడ కూడా జరుగుతుంది.. అని తీవ్ర స్ధాయిలో వ్యాఖ్యానించారు.

సీఎం కేసీఆర్ రజాకార్ల పాలనను తలపిస్తున్నారని ఆయన అన్నారు. 2018 ఎన్నికల్లో నన్ను ఓడించటానికి ఎన్ని కుట్రలు చేసినా నియోజక వర్గ ప్రజలు నాకు అండగా ఉండి గెలిపించారు… ఇప్పుడు నిలుస్తారు… నాకు చట్టం మీద నమ్మకం.. విశ్వాసం ఉంది.. పోలీసులు సహకరించండి అని ఈటల అన్నారు.