Peddireddy : టీఆర్ఎస్ లో చేరిన మాజీమంత్రి పెద్దిరెడ్డి

మాజీ మంత్రి పెద్దిరెడ్డి టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. కేసీఆర్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి అహ్వాహించారు. ఆయనతోపాటు మరికొందరు నేతలు టీఆర్ఎస్ లో చేరారు. కాగా హుజురాబాద్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన పెద్దిరెడ్డి…మాజీ మంత్రి ఈటల రాజేందర్ పార్టీలో చేరికను వ్యతిరేకించారు.

Peddireddy : టీఆర్ఎస్ లో చేరిన మాజీమంత్రి పెద్దిరెడ్డి

Peddireddy (2)

Peddireddy : మాజీ మంత్రి పెద్దిరెడ్డి టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. కేసీఆర్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి అహ్వాహించారు. ఆయనతోపాటు మరికొందరు నేతలు టీఆర్ఎస్ లో చేరారు. కాగా హుజురాబాద్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన పెద్దిరెడ్డి…మాజీ మంత్రి ఈటల రాజేందర్ పార్టీలో చేరికను వ్యతిరేకించారు.

రాజేందర్ బీజేపీలో చేరినప్పటి నుంచి ఆయన అసంతృప్తిగా ఉండగా.. అప్పటి నుండే బీజేపీలో ఇమడలేకపోతున్నామనే భావనలో పెద్దిరెడ్డి ఉన్నట్లు రాజకీయ వర్గాలలో వినిపించింది. ఈటల చేరిన సమయం నుండే పెద్దిరెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తుండగా ఆయన పార్టీకి గుడ్ బై చెప్పనున్నారనే ప్రచారం కూడా జరుగుతూ వచ్చింది. ఇక ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

ఇక ఈ సందర్బంగా కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. పెద్దిరెడ్డి తాను చాలా సన్నిహితులమని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సమయంలో ఇద్దరం ఆ పార్టీలో చేరి మంత్రిపదవులు చేపట్టామని వివరించారు. సమాజం పట్ల పెద్దిరెడ్డికి మంచి అవగాహన ఉందని వివరించారు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రగతి ప్రస్థానంలో వారు చేదోడు వాదోడుగా ఉంటారని కేసీఆర్ అన్నారు. భవిష్యత్తులో తెలంగాణ అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు.

ఇక ఇదే సమయంలో చేనేత కార్మికుల సమస్యలపై మాట్లాడారు. చేనేత కార్మికులకు పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు కేసీఆర్. తెలంగాణలో అన్ని వర్గాల అభివృద్దే తమ అంతిమ లక్ష్యమని తెలిపారు.