Boora Narsaiah Goud : టీఆర్ఎస్‌లో మునుగోడు కాక.. నన్ను తొక్కేస్తున్నారు అంటూ మంత్రిపై బూర నర్సయ్య గౌడ్ హాట్ కామెంట్స్

మునుగోడు ఉపఎన్నిక.. అధికార పార్టీ టీఆర్ఎస్ లో కాక పుట్టించింది. మునుగోడు టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. టికెట్ కోసం గులాబీ నేతలు కొట్లాడుకుంటున్నారు.

Boora Narsaiah Goud : టీఆర్ఎస్‌లో మునుగోడు కాక.. నన్ను తొక్కేస్తున్నారు అంటూ మంత్రిపై బూర నర్సయ్య గౌడ్ హాట్ కామెంట్స్

Boora Narsaiah Goud : మునుగోడు ఉపఎన్నిక.. అధికార పార్టీ టీఆర్ఎస్ లో కాక పుట్టించింది. మునుగోడు టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. టికెట్ కోసం గులాబీ నేతలు కొట్లాడుకుంటున్నారు. అధికార పార్టీలో అంతర్గత పోరు ముదిరింది. ఆశావహులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. టికెట్ నాకంటే నాకే అంటూ కర్చీఫ్ లు వేసే పనిలో బీజీగా ఉన్నారు. ఈ లిస్టులోకి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కూడా చేరిపోయారు.

తాను టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్నా అని బూర నర్సయ్య గౌడ్ అనడంలో తప్పులేదు. కానీ.. తాను బలమైన లీడర్ ని అని తెలిసి కూడా, తనను కావాలనే పక్కన పెడుతున్నారంటూ హాట్ కామెంట్స్ చేసి అధికార పార్టీలో కలకలం రేపారాయన. తనను పార్టీ కార్యక్రమాలకు సైతం దూరం పెడుతున్నారని ఆరోపించారు బూర. అంతేకాదు మరో అడుగు ముందుకేసి జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డిపైనా సూటిగా మాటల బాణాలు సంధించారు.

మంత్రి జగదీశ్ రెడ్డిపై బూర నర్సయ్య గౌడ్ హాట్ కామెంట్స్ చేశారు. తనకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వడంలో లేదో చెప్పాలంటూ మంత్రిని నిలదీశారు. తానెప్పుడూ ప్రజల్లోనే ఉన్నానని అన్నారు. అయితే తనకు, కర్నె ప్రభాకర్ కు పార్టీ సమాచారం అందడం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలా ఎందుకు జరుగుతుందో జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డే చెప్పాలన్నారు. నా బలం తెలిసినా నన్ను ఎందుకు పక్కన పెడుతున్నారో అర్థం కావడం లేదన్నారాయన. పార్టీ కార్యక్రమాలకు సైతం తనను దూరం పెడుతున్నారని ఫైర్ అయ్యారు.

తాను మునుగోడు టికెట్ ఆశించటంలో తప్పేముందని బూర ప్రశ్నించారు. మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి పరంగా వెనుకబడిందని బూర నర్సయ్య గౌడ్ చెప్పారు. అభివృద్ధి తప్ప వేరే అంశాలను తాను పట్టించుకోను అన్నారు. ప్రజలు దూరదృష్టితో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మునుగోడు నియోజకవర్గంలో బీసీ సామాజికవర్గం బలంగా ఉంది. నేను కూడా బీసీనే అందుకే టికెట్ అడుగుతున్నా అని బూర అన్నారు.

మొత్తంగా బూర నర్సయ్య గౌడ్ కూడా తన మనసులో మాట బయటపెట్టారు. తాను కూడా రేస్ లో ఉన్నట్టు ప్రకటించారు. తనన కావాలనే పక్కన పెడుతున్నారు అంటూ మంత్రి జగదీశ్ రెడ్డిపై ఆరోపణలు గుప్పించి హీట్ పెంచారు.