మేయర్ పీఠాన్ని డిసైడ్ చేయనున్న ఎక్స్ అఫీషియో ఓట్లు

మేయర్ పీఠాన్ని డిసైడ్ చేయనున్న ఎక్స్ అఫీషియో ఓట్లు

గ్రేటర్ ఎన్నికల్లో మేయర్ పీఠం కోసం పొత్తు తప్పదా.. లేదా ఎక్స్ అఫీషియో ఓట్లతోనే మేయర్ పీఠాన్ని దక్కించుకుంటుందా టీఆర్ఎస్ అనేది ఉత్కంఠగా మారింది. వంద ఓట్లు వస్తేనే గ్రేటర్ మేయర్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉంది. టీఆర్ఎస్‌కు 66 కంటే తక్కువ మాత్రమే వస్తే ఎమ్ఐఎమ్‌తో పొత్తు పెట్టుకోవాల్సిందే. జీహెచ్ఎంసీలో ఎక్స్ అఫీషియో ఓటు వేయడానికి 51మంది అర్హత కలిగి ఉన్నారు.
ఇందులో టీఆర్ఎస్ 34 మందికి
ఎమ్ఐఎమ్ 10మంది
బీజేపీకి 3మంది
కాంగ్రెస్‌కు ఒక్కరు మాత్రమే

ఈ లెక్కన చూస్తే 34తో పాటు 66డివిజన్లు గెలిస్తే టీఆర్ఎస్ పార్టీ మేయర్ పీఠాన్ని దక్కించుకోవచ్చు. అలా కుదరని పక్షంలో ఎమ్ఐఎమ్ తో పొత్తు పెట్టుకుని మేయర్ పీఠాన్ని దక్కించుకుంటుంది. డివిజన్ల వారీగా లెక్కవేస్తే అది 76 కింద మాత్రమే పరిగణిస్తారు.