విద్యార్థులకు వాట్సాప్ లో ఎగ్జామ్స్

విద్యార్థులకు వాట్సాప్ లో ఎగ్జామ్స్

Exams on WhatsApp for students : మీ పిల్లలు 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్నారా? ఆన్‌లైన్‌ క్లాసులు వింటున్నారా? వాళ్లకు పాఠాలు అర్థమవుతున్నాయా లేదా? అని అనుమానంగా ఉందా? ఏం ఆందోళన వద్దు. మీ పిల్లల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్‌ బేస్డ్‌ చాట్‌బూట్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్‌ ద్వారా వారానికి ఒక సారి అన్ని సబ్జెక్టుల్లో పరీక్షలు నిర్వహిస్తుంది. 85955 24405 నంబర్‌కు వాట్సాప్‌లో ‘హాయ్‌’ అని పంపాలి.

విద్యార్థి పేరు, తరగతి, మీడియం వివరాలు నమోదు చేయాలి. తరగతుల వారిగా ప్రతీవారం రెండు సబ్జెక్టులకు సంబంధించిన 8-10 ప్రశ్నలు వాట్సాప్‌లో పంపుతారు. వాటికి సమాధానం ఇచ్చిన కొద్ది క్షణాల వ్యవధిలో తప్పో, రైటో తేల్చేస్తారు. తప్పు సమాధానాలకు సంబంధించిన వీడియో పాఠాలను వాట్సాప్‌ ద్వారా పంపుతారు.

ఈ వినూత్న యాప్‌ను ‘ఇంటింటా చదువుల పండుగ- వాట్సాప్‌ బేస్డ్‌ చాట్‌ బూట్‌’ను సోమవారం నుంచి విద్యాశాఖ అందుబాటులోకి తెచ్చింది. ఎంసీహెచ్‌ఆర్డీలో జరిగిన కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్‌, సబితా ఇంద్రారెడ్డి ఈ యాప్‌ను ఆవిష్కరించారు.