Drugs Case : టాలీవుడ్ డ్రగ్స్‌ కేసులో కీలక మలుపు.. ఈడీకి కాల్ రికార్డింగ్స్‌ ఇవ్వని ఎక్సైజ్‌ శాఖ

టాలీవుడ్ డ్రగ్స్ పై ఈడీ లోతుగా దర్యాప్తు చేస్తోంది. పూర్తి వివరాలు, ఆధారాల కోసం ఇప్పటికే ఎక్సైజ్ శాఖకు లేఖ రాసింది.

Drugs Case : టాలీవుడ్ డ్రగ్స్‌ కేసులో కీలక మలుపు.. ఈడీకి కాల్ రికార్డింగ్స్‌ ఇవ్వని ఎక్సైజ్‌ శాఖ

Drug Case

Tollywood drugs case : టాలీవుడ్ డ్రగ్స్‌ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఎక్సైజ్‌ శాఖ.. కాల్ రికార్డింగ్స్‌ ను ఈడీకి ఇవ్వలేదు. టాలీవుడ్ డ్రగ్స్‌ కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తోంది. FSL రిపోర్టులతో పాటు ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇవ్వాలని కోరినా.. ఇప్పటి వరకూ అవి ఈడీకి చేరలేదు. వాస్తవానికి 2017లో టాలీవుడ్ స్టార్ట్‌తో పాటు మొత్తం 41 మంది కాల్ డేటాను ఎక్సైజ్ శాఖ రికార్డు చేసింది. కాల్ డేటా మొత్తం ట్రైల్ కోర్టులో ఉందని.. ఎక్సైజ్ శాఖ చెబుతుంటే..వాంగ్మూలం కాపీలు మాత్రమే ఉన్నాయని.. వాటిలో కాల్‌ డేటా లేదని ఈడీ చెబుతోంది. దీనికి సంబంధించి హైకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఈడీ ఉంది.

టాలీవుడ్ డ్రగ్స్ పై ఈడీ లోతుగా దర్యాప్తు చేస్తోంది. పూర్తి వివరాలు, ఆధారాల కోసం ఈడీ ఇప్పటికే ఎక్సైజ్ శాఖకు లేఖ రాసింది. 2017లో టాలీవుడ్ స్టార్స్ తో పాటు మొత్తం 41 మంది కాల్ డేటా రికార్డింగ్స్ ఎక్సైజ్ శాఖ నమోదు చేసింది. వీరిపై 2017 లో 12 ఎఫ్ ఐ ఆర్లు నమోదు చేసింది. డ్రగ్స్ నిందితులతో పాటు సాక్షుల నుండి కాల్ డేటా రికార్డింగ్స్ తీసుకున్నామని ఎక్సైజ్ సూపర్డెంట్ శ్రీనివాస్ ఈడికి తెలిపారు.

Road Accident : విజయవాడలో రోడ్లు శుభ్రం చేస్తున్న సిబ్బందిని ఢీకొట్టిన కారు…మహిళ మృతి

విచారణ సందర్భంగా అందరి కాల్ డేటాను ఎక్సైజ్ శాఖ రికార్డింగ్స్ చేసింది. నిందితుడు కెల్విన్ మొబైల్ ఫోన్ ను సైతం ఎక్సైస్ శాఖ సీజ్ చేసింది. డ్రగ్స్ ఫెడ్లర్ కెల్విన్ తో స్టార్స్ కు ఉన్న సంబంధాల ఆధారాల కోసం స్టార్స్ కాల్ డేటా రికార్డింగ్స్ బయటికి తీసింది. కానీ, కాల్ రికార్డింగ్స్ డాటా ఈడి కి అందలేదు. ఎఫ్ ఎస్ ఎల్ రిపోర్ట్ లతో పాటు, ఎక్సైజ్ శాఖ సీజ్ చేసిన ఒరిజినల్ మెటీరియల్ ను ఇవ్వాలని ఈడి కోరింది.

ట్రైల్ కోర్ట్ లో ఉన్నాయని ఎక్సైజ్ శాఖ తెలిపింది. కోర్ట్ కు ఎక్సైజ్ శాఖ సమర్పించిన వాంగ్మూలాల కాపీలు మాత్రమే అందాయని ఈడి అంటోంది. అందులో కాల్ డేటా రికార్డింగ్స్ లేవని ఈడి చెబుతోంది. దీంతో తిరిగి హైకోర్టు దృష్టికి తీసుకొచ్చే యోచనలో ఈడీ ఉన్నట్లు తెలుస్తోంది.