Yadagirigutta : యాదగిరిగుట్టపైకి వెళ్లే వాహనదారులకు గూడ్ న్యూస్

యాదగిరిగుట్టపై కొత్త పార్కింగ్‌ ఫీజులు అమల్లోకి తెచ్చారు. కారుతో కొండెక్కితే మొదటి గంటకు రూ.500 వసూలు చేస్తారు.

Yadagirigutta : యాదగిరిగుట్టపైకి వెళ్లే వాహనదారులకు గూడ్ న్యూస్

Yadagirigutta (1)

Extra fare waived : యాదగిరిగుట్టపైకి వెళ్లే వాహనదారులకు గుడ్ న్యూస్. కొండపైకి వెళ్లే వాహనాలకు అదనపు రుసుం ఎత్తివేశారు. రూ.500 ప్రత్యేక రుసుంతో కొండపైకి వెళ్లేందుకు వాహనాలకు అనుమతి ఇచ్చారు. గంటకు రూ.100 అదనపు రుసుం ఎత్తివేస్తున్నట్లు ఇంచార్జ్ ఈవో ప్రకటన చేశారు. దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

యాదగిరిగుట్టపై కొత్త పార్కింగ్‌ ఫీజులు అమల్లోకి తెచ్చారు. కారుతో కొండెక్కితే మొదటి గంటకు రూ.500 వసూలు చేస్తారు. మొదటి గంట తర్వాత ఎన్ని గంటలు ఉంటే అన్ని గంటల వరకు.. ప్రతి గంటకు రూ.100 చొప్పున వసూలు చేయాలనుకున్నారు. అయితే కొత్తగా అమలు చేసిన పార్కింగ్‌ ఫీజులను స్థానికులు, భక్తులు తీవ్రంగా వ్యతిరేకించారు.

Yadagiri Gutta : అమలులోకి యాదగిరిగుట్టపై కొత్త పార్కింగ్ ఫీజులు

ఈ నేపథ్యంలో యాదగిరిగుట్టపైకి వెళ్లే వాహనాలకు అదనపు రుసుమును ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రూ.500 ప్రత్యేక రుసుంతో కొండపైకి వెళ్లేందుకు వాహనాలకు అనుమతి ఇచ్చారు. గంటకు రూ.100 అదనపు రుసుం ఎత్తివేశారు. ఈ నిర్ణయంతో కొండపైకి వెళ్లే వహనాదారులకు కొంత మేరకు ఊరటని చెప్పవచ్చు.