Telangana : వర్ష బీభత్సం.. 120 ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షపాతం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో 120 ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షపాతం నమోదైంది.

Telangana : వర్ష బీభత్సం.. 120 ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షపాతం

Rain

Extremely Heavy Rainfall : తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు నగరాలు, పట్టణాలు, పల్లెలు చెరువులను తలపిస్తున్నాయి. కాలనీలు, ఇళ్లను వరద బురద ముంచెత్తింది. కుండపోతకు పలు జిల్లాలు, ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటలు మత్తళ్లు పోస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో 120 ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షపాతం నమోదైంది. హన్మకొండ జిల్లా నడికూడలో 38.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. తెలంగాణలోని 21 ప్రాంతాల్లో 20 నుంచి 38.8 సెంటీమీటర్ల వరకు వర్షపాతాలు నమోదయ్యాయి.

Read More : TTD : సర్వ దర్శనం టోకెన్ల జారీ..చిత్తూరు జిల్లా వాసులకు మాత్రమే

జనజీవనం అతలాకుతలం :-
ఉత్తర తెలంగాణలోని కరీంనగర్‌, నిజామాబాద్‌, వరంగల్‌, సిరిసిల్ల, భద్రాద్రి, ఆదిలాబాద్‌ జిల్లాల్లో జనజీవనం అతలాకుతలమైంది. రహదారులు కొట్టుకుపోవడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. లక్షల ఎకరాల్లో రకరకాల పంటలు నీటమునిగాయి. దీంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. వర్షాలు, వరదలకు ఆరుగురు మృతి చెందారు. ఇద్దరు గల్లంతయ్యారు. వరంగల్, కరీంనగర్‌లో కాలనీలన్నీ జలమయమయ్యాయి.

Read More : Arogyasri : జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆరోగ్యశ్రీ పరిధిలోకి విష జ్వరాలు

ముంపులో కాలనీలు :-
వరంగల్‌లో 20 కాలనీలు నీటమునిగితే.. 500 మందిని రెస్క్యూ టీమ్‌ రక్షించింది. కరీంనగర్‌లో్ 15 కాలనీలు ముంపునకు గురయ్యాయి. వరంగల్‌- కరీంనగర్‌ హైవే, వరంగల్‌-ములుగు హైవేపై కటాక్షపూర్‌ చెరువు వద్ద వరద పోటెత్తింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని పాకాల వాగు, మున్నేరు, ఆకేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. కామారెడ్డి-కరీంనగర్‌ రూట్‌లో.. కమాన్‌పూర్‌ వద్ద నిర్మాణంలో ఉన్న మెయిన్‌రోడ్‌ కొట్టుకుపోయింది. ములుగు జిల్లా పాలంపేటలోని రామప్ప తూర్పు రోడ్డుకు గండి పడింది. రామప్ప సరస్సు మత్తడి ఉప్పొంగడంతో రహదారి తెగిపోయింది.

Read More : MK Stalin : కుటుంబానికి రూ.5వేలు.. సీఎం మరో కీలక నిర్ణయం

నిలిచిపోయిన రాకపోకలు :-
సిరిసిల్ల, వేములవాడ, కోరుట్ల, మెట్‌పల్లి, జగిత్యాల, హుజూరాబాద్‌, జమ్మికుంట, ఇల్లందకుంట, నిజామాబాద్‌లోని పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలు చోట్ల కార్లు, బైక్‌లు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. భద్రాద్రి జిల్లాలో కిన్నెరసాని వాగు ఉప్పొంగడంతో ఆవలి ఒడ్డున ఉన్న గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం, దుమ్మగూడెంలో గోదావరి ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. పెద్దచెరువు, జంగమయ్యకుంట, శుద్ధికుంట, కొత్త చెరువులు సిరిసిల్ల జలదిగ్బంధమైంది. పట్టణంలోని 25 కాలనీలు నీటమునిగాయి. 146 కుటుంబాలకు పునరావాసం కల్పించారు. సమీకృత కలెక్టరేట్‌ జల దిగ్బంధంలో చిక్కుకుంది.