Fake Certificates Rocket: హనుమకొండలో నకిలీ సర్టిఫికెట్ల ముఠా అరెస్టు

దేశవ్యాప్తంగా పలు యూనివర్సిటీలకు చెందిన నకిలీ సర్టిఫికేట్ తయారీ ముఠాను పోలీసులు కనుగొన్నారు. కొందరినీ ఈ ఫేక్ సర్టిఫికేట్లతో విదేశాలకు కూడా పంపినట్లు సమాచారం.

Fake Certificates Rocket: హనుమకొండలో నకిలీ సర్టిఫికెట్ల ముఠా అరెస్టు

Fake Certificates

Fake Certificates Rocket: దేశవ్యాప్తంగా పలు యూనివర్సిటీలకు చెందిన నకిలీ సర్టిఫికేట్ తయారీ ముఠాను పోలీసులు కనుగొన్నారు. కొందరినీ ఈ ఫేక్ సర్టిఫికేట్లతో విదేశాలకు కూడా పంపినట్లు సమాచారం. విషయం తెలుసుకుని రైడ్ చేసిన పోలీసులకు వారి నుంచి 212 నకిలీ సర్టిఫికెట్‌లు, 6 లాప్‌టాప్‌లు, 1 ఐ పాడ్, 2 ప్రింటర్లు, 5 సీపీయూలు, 25 నకిలీ రబ్బరు స్టాంపులు, 2 ప్రింటర్ రోలర్స్, 5 ప్రింటర్ కలర్స్ బాటిల్, 1 లామినేషన్ మిషన్, 12 సెల్ ఫోన్లు, 10 లామినేషన్ గ్లాస్ పేపర్స్ స్వాధీనం చేసుకున్నారు.

మొత్తం పన్నెండు మంది సభ్యుల ముఠాను వరంగల్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ముఠా సభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

…………………………….: ఎప్పుడో రిటైర్ అయిపోదామనుకున్నా – అశ్విన్