Cyber crime : కలెక్టర్ పేరిట నకిలీ వాట్సప్ ఖాతా.. రూ. 2.40లక్షలు కొట్టేసిన సైబర్ నేరగాడు

సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రముఖుల పేరుపై నకిలీ ఖాతాలు సృష్టిస్తూ లక్షల్లో కొట్టేస్తున్నారు. తాజాగా ఏకంగా కలెక్టర్ పేరుపైనే నకిలీ వాట్సాప్ ఖాతాను సృష్టించిన ఓ సైబర్ ...

Cyber crime : కలెక్టర్ పేరిట నకిలీ వాట్సప్ ఖాతా.. రూ. 2.40లక్షలు కొట్టేసిన సైబర్ నేరగాడు

Cyber Crmie

Cyber crime : సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రముఖుల పేరుపై నకిలీ ఖాతాలు సృష్టిస్తూ లక్షల్లో కొట్టేస్తున్నారు. తాజాగా ఏకంగా కలెక్టర్ పేరుపైనే నకిలీ వాట్సాప్ ఖాతాను సృష్టించిన ఓ సైబర్ నేరగాడు.. రూ. 2.40లక్షలు నగదు తన ఖాతాలోకి బదిలీ చేయించుకున్నాడు. విషయం తెలుసుకున్న వ్యక్తి.. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇదంతా సైబర్ నేరగాళ్ల పనేనని తేలింది.

Cyber Crime : కేవైసీ పేరుతో ఘరానా మోసం.. రూ.15లక్షలు మాయం

నారాయణపేట కలెక్టర్ హరిచందన పేరు, ఆమె ఫొటోతో సైబర్ నేరగాడు నకిలీ వాట్సప్ ఖాతాను సృష్టించాడు. ఈ వాట్సప్ ఖాతా నుండి పలువురి అధికారులకు, ప్రముఖులకు.. తాను సమావేశంలో ఉన్నానని, ఒక వస్తువు వెంటనే కొనుగోలు చేసేందుకు నగదు కావాలంటూ మెస్సేజ్ చేశాడు. ఈ మెస్సేజ్ చూసిన జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి మూడు విడతలుగా రూ. 2.40 లక్షలు ఆమె ఖాతాకు బదిలీ చేశాడు. కొద్దిసేపటికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వాట్సాప్ లో మెస్సేజ్ ఇచ్చింది కలెక్టర్ కాదని, సైబర్ నేరగాడు అని పోలీసులు తేల్చారు. సదరు వ్యక్తి ఝార్ఖండ్ కు చెందిన వాడని గుర్తించామని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా నారాయణపేట జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. ఎన్ పీఆర్ పీ పోర్టల్ ద్వారా నేషనల్ సైబర్ క్రైం రిపోర్టింగ్ పోర్టల్ కు ఫిర్యాదు చేసి విచారిస్తామని తెలిపారు.

Cyber Crime : విత్తనాల వ్యాపారం పేరుతో రూ.34 లక్షల మోసం

దేశ, రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ క్రైంలు రోజురోజుకు పెరుగుతున్నాయి. వస్తువుల ఆర్డర్ల పేరుతో, లాటరీ తగిలిందని, ఆఫర్లు వచ్చాయంటూ, మరో వైపు నకిలీ ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సప్ ఖాతాలు సృష్టించి డబ్బులు కాజేస్తున్నారు. సైబర్ నేరాలపై ప్రజలకు పోలీస్ శాఖ విస్తృతంగా ప్రచారం కల్పిస్తుంది. అయినా పలువురు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడిపోతూ సొమ్మును చేతులారా పోగొట్టుకుంటున్నారు.