Telangana Politics :వారసులొస్తున్నారహో..! వచ్చే ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్న నాయకుల కుటుంబసభ్యులు..

వారసత్వ రాజకీయాలు కొందరి కలిసొచ్చాయ్. చాలా మందికి తెలిసొచ్చాయ్. వాటిలో పాస్ కావాలంటే.. మాస్ ఇమేజ్ కావాలి. అది లేని వాళ్లంతా.. లెగసీ కంటిన్యూ చేయలేక ఫెయిలైపోయారు. అయితే.. తమ వారసుల పొలిటికల్ కెరీర్‌ని.. సక్సెస్‌ఫుల్‌గా తీర్చిదిద్దేందుకు.. తమ అనుభవాన్నంతా రంగరించి.. వ్యూహాలకు పదును పెడుతున్నారు కరీంనగర్ జిల్లాలోని రాజకీయ ఉద్ధండులు.

Telangana Politics :వారసులొస్తున్నారహో..! వచ్చే ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్న నాయకుల కుటుంబసభ్యులు..

Telangana Politics

Telangana Politics : కొడుకు పొలిటికల్ కెరీర్ తీర్చిదిద్దాలని.. ఓ మాజీ గవర్నర్, వారసుడిని రాజకీయాలకు పరిచయం చేసి.. రిటైర్ అయిపోదామని ఓ ఎమ్మెల్యే.. తాత ఇమేజ్‌తో జనాలకు దగ్గరవ్వాలని ఓ మనవడు, తండ్రి రాజకీయజాడల్లో నడవాలని.. ఓ తనయుడు.. మామ ఆశీర్వాదంతో ఓ కోడలు.. ఇలా.. కరీంనగర్ జిల్లాలో వారసులంతా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఇందుకోసం.. వచ్చే ఎన్నికలనే ముహూర్తంగా సెట్ చేసుకున్నారు. ఉద్ధండ నాయకుల కుటుంబసభ్యులు పోటీకి సిద్ధమవుతుండటంతో.. ఆ నియోజకవర్గాలపై ఆశలు పెట్టుకున్న ఆశావహులంతా.. డిజప్పాయింట్ అవుతున్నారు.

వారసత్వ రాజకీయాలు కొందరి కలిసొచ్చాయ్. చాలా మందికి తెలిసొచ్చాయ్. వాటిలో పాస్ కావాలంటే.. మాస్ ఇమేజ్ కావాలి. అది లేని వాళ్లంతా.. లెగసీ కంటిన్యూ చేయలేక ఫెయిలైపోయారు. అయితే.. తమ వారసుల పొలిటికల్ కెరీర్‌ని.. సక్సెస్‌ఫుల్‌గా తీర్చిదిద్దేందుకు.. తమ అనుభవాన్నంతా రంగరించి.. వ్యూహాలకు పదును పెడుతున్నారు కరీంనగర్ జిల్లాలోని రాజకీయ ఉద్ధండులు.రాజకీయాల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు.. తన రాజకీయ వారసుడిగా కొడుకు వికాస్‌ని బరిలోకి దించే ఆలోచనలో ఉన్నారు. వేములవాడ నుంచి బీజేపీ అభ్యర్థిగా వికాస్‌ని పోటీ చేయించేందుకు.. పెద్దాయన పెద్దగానే ప్లాన్ చేశారనే చర్చ సాగుతోంది. ఇప్పటికే.. కొడుకుతో పాటు విద్యాసాగర్ రావు సైతం.. నియోజకవర్గంలో వరుసగా టూర్లు వేస్తున్నారు. కొడుకును ఎమ్మెల్యేగా చూడాలన్నదే.. మాజీ గవర్నర్ గారి కోరిక అని.. అనుచరుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయ్.

సీనియర్ కాంగ్రెస్ లీడర్ ఎమ్మెస్సార్ మరణంతో.. ఆ కుటుంబం నుంచి ఎవరూ రాజకీయాల్లోకి రారనే చర్చ సాగింది. కానీ.. ఒకడున్నాడు.. వస్తున్నాడు.. అనేలా.. ఎమ్మెస్సార్ మనవడు రోహిత్ రావు.. కొన్నాళ్లుగా పొలిటికల్‌గా హడావుడి పెంచారు. కాంగ్రెస్‌లో ఫుల్ యాక్టివ్‌ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో.. కరీంనగర్ గానీ హుస్నాబాద్ నుంచి గానీ.. పోటీ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. తాత పొలిటికల్ ఇమేజ్, కాంగ్రెస్‌లో ప్రస్తుతం నెలకొన్న జోష్.. తనకు అనుకూలిస్తాయని.. రోహిత్ లెక్కలేసుకుంటున్నారట.

మాజీ ఎంపీ.. వివేక్ వెంకట స్వామి తనయుడు గడ్డం వంశీ కృష్ణ కూడా.. తాత, తండ్రి బాటలోనే.. పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. కొడుకును పెద్దపల్లి లోక్‌సభ స్థానం పరిధిలోని.. ఎస్సీ నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని వివేక్ భావిస్తున్నట్లు.. ఆయన అనుచరుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయ్. ధర్మపురి, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో.. ఎన్నికల నాటికి ఉండే అనుకూల పరిస్థితులను చూసి.. వివేక్ కొడుకును పోటీకి దించుతారని.. జిల్లాలో చర్చ నడుస్తోంది.

కోరుట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే.. కల్వకుంట్ల విద్యాసాగర్ రావు.. ఎన్నికల నాటికి.. రాజకీయాల నుంచి రిటైర్ అవుతారనే ప్రచారం మొదలైంది. తాను తప్పుకొని.. తనయుడు సంజయ్‌ని.. అధికార పార్టీ నుంచి బరిలోకి దించేందుకు ప్లాన్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే.. తండ్రి డైరెక్షన్‌లో.. సంజయ్ కోరుట్ల మొత్తం చుట్టేస్తున్నారు. జనం సమస్యలతో పాటు రాజకీయాలపై అవగాహన పెంచుకుంటున్నారు. సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేస్తూ.. వచ్చే ఎన్నికల్లో తానే అభ్యర్థిననే సంకేతాలిస్తున్నారని చర్చ నడుస్తోంది.

ఇక.. తన రాజకీయ వారసురాలిగా కోడలు మమతారెడ్డిని పాలిటిక్స్‌లోకి తెచ్చారు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. ఇప్పటితే.. మమత పెద్దపల్లి మున్సిపల్ ఛైర్మన్‌గా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో.. మనోహర్ రెడ్డి.. కోడలిని బరిలోకి దించుతారనే చర్చ కొంతకాలంగా సాగుతోంది. కోడలికి టికెట్ ఇప్పించుకునేందుకు.. నియోజకవర్గంలో పోటీ లేకుండా జాగ్రత్త పడుతున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది.సీనియర్ నేతల.. వారసుల ఎంట్రీతో.. కరీంనగర్ జిల్లాలోని ఆశావహులంతా .. నిరుత్సాహంలో కూరుకుపోయారు. అయితే.. ఎన్నికల్లో రెబల్స్‌గా బరిలోకి దిగే అవకాశాలున్నాయని కూడా అంటున్నారు. అయితే.. వారసత్వాన్ని నమ్ముకొని వస్తున్న యువ నాయకులను.. జనం ఏ మేరకు ఆదరిస్తారన్నది తెలియాలంటే.. ఇంకొన్ని నెలలు వెయిట్ చేయాల్సిందే.