Farmer Dead : ధాన్యం కొనుగోలు కేంద్రంలో గుండెపోటుతో రైతు మృతి

కరీంనగర్ జిల్లాలో విషాదం నెలకొంది. ఆబాది జమ్మికుంటలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో గుండెపోటుతో రైతు మృతి చెందారు. ధాన్యాన్ని సంచుల్లో నింపుతుండగా గుండెపోటు రావడంతో మరణించారు.

Farmer Dead : ధాన్యం కొనుగోలు కేంద్రంలో గుండెపోటుతో రైతు మృతి

Riathu Dead

grain purchasing center : కరీంనగర్ జిల్లాలో విషాదం నెలకొంది. ఆబాది జమ్మికుంటలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో గుండెపోటుతో రైతు మృతి చెందారు. ధాన్యాన్ని సంచుల్లో నింపుతుండగా రైతు బిట్ల ఐలయ్యకు గుండెపోటు వచ్చింది. దీంతో అతను ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే మృతి చెందారు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. మృతదేహాన్ని అక్కడ నుంచి తరలించకుండా అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఆబాది జమ్మికుంటలో ఉద్రిక్తత నెలకొంది.

రైతు బిట్ల ఐలయ్య 15 రోజుల క్రితం కరీంనగర్ జిల్లా ఆబాది జమ్మికుంటలోని ధాన్యం కొనుగోలు కేంద్రానికి వరి తీసుకెళ్లారు. అయితే తేమ శాతం ఎక్కువగా ఉందనే కారణంతో..అక్కడి సిబ్బంది వడ్లు కొనుగోలు చేయకుండా రైతును ఇబ్బందులకు గురి చేశారు. దీంతో రైతు బిట్ల ఐలయ్య ప్రతి రోజూ ఐకేపీ కేంద్రానికి వెళ్లి.. తన వడ్లు ఆరబోసుకుని వస్తున్నాడు. దీంతో రైతు మానసికంగా ఆందోళన చెందినట్లుగా కుటుంబ సభ్యలు చెబుతున్నారు.

Omicron Tension : శ్రీకాకుళం జిల్లాలో ఒమిక్రాన్ టెన్షన్..దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి కోవిడ్ పాజిటివ్

రోజూలాగే ఇవాళ కూడా రైతు ఐలయ్య ఐకేపీ దగ్గర వడ్లను ఆరబోశాడు. ఆరబోసిన ధాన్యాన్ని ఇవాళ ఉదయం సంచుల్లో నింపుతుండగా గుండె పొటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలి పోయి అక్కడికక్కడే మృతి చెందారు. అక్కడే ఉన్న తోటి రైతులు ఐలయ్యను కాపాడే ప్రయత్నం చేశారు. హుటాహుటినా ఆస్పత్రికి తరలించే లోపే రైతు మృతి చెందారు. దీంతో కటుంబ సభ్యులంతా ఐకేపీ కేంద్రానికి చేరుకుని గుండెలవిసేలా రోధిస్తున్నారు.

రైతు ఐలయ్య మృతితో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. కేవలం 20 గుంటల భూమి సాగు చేస్తున్న రైతు.. తన ధాన్యాన్ని అమ్ముకునేందుకు తీవ్ర ఇబ్బంది పడ్డారు. మానసికంగా ఆందోళన చెంది, గ్రామంలోనే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. రెవెన్యూ శాఖ అధికారులతోపాటు పోలీసులు ఐకేపీ కేంద్రానికి చేరుకున్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టారు.