ముందుజాగ్రత్త.. కరోనా రాకుండా మేకలకు మాస్కులు

కరోనా వైరస్.. యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కోట్లాది మందికి నిద్ర లేకుండా చేసింది. వేలాది మంది ప్రాణాలు తీసింది. దీంతో కరోనా సోకకుండా అందరూ జాగ్రత్తలు

ముందుజాగ్రత్త.. కరోనా రాకుండా మేకలకు మాస్కులు

కరోనా వైరస్.. యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కోట్లాది మందికి నిద్ర లేకుండా చేసింది. వేలాది మంది ప్రాణాలు తీసింది. దీంతో కరోనా సోకకుండా అందరూ జాగ్రత్తలు

కరోనా వైరస్.. యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కోట్లాది మందికి నిద్ర లేకుండా చేసింది. వేలాది మంది ప్రాణాలు తీసింది. దీంతో కరోనా సోకకుండా అందరూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముందు జాగ్రత్తగా మాస్కులు ధరిస్తున్నారు. సామాజిక దూరం పాటిస్తున్నారు. ఈ ప్రాణాంతక వైరస్ కి ఇప్పటివరకు వ్యాక్సిన్ కనిపెట్టలేపోయారు. దీంతో అందరికి ప్రాణభయం పట్టుకుంది. కాగా, పశువులు, జంతువులకి కూడా కరోనా సోకుతుందనే ప్రచారం వాటి యజమానులను ఆందోళనకు గురి చేస్తోంది.

అమెరికాలోని ఓ జూలో ఆడ పులికి కరోనా వైరస్ సోకిందనే వార్తతో ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మేకల యజమాని అలర్ట్ అయ్యాడు. ముందుజాగ్రత్తగా తన మేకలకు అతడు మాస్కులు కట్టాడు. అతడు చేసిన పని ఇప్పుడు వైరల్ గా మారింది. మాస్కులతో ఉన్న మేకలు చూసి అంతా విస్తుపోతున్నారు. కొందరు నవ్వుకుంటే, మరికొందరు మంచి పని చేశావ్ అని మెచ్చుకున్నారు.

కల్లూరు మండలం పేరువంచ గ్రామానికి చెందిన శ్రీరాములు కోటయ్యకు 50 మేకలు ఉన్నాయి. ఆ మేకలే అతడి జీవనాధారం. జంతువులకు కూడా కరోనా వస్తుందనే వార్త కోటయ్యను ఆందోళనకు గురి చేసింది. మేకలకు వైరస్ సోకకుండా ముందు జాగ్రత్తగా మాస్కులు కట్టాడు. ఇంటి నుంచి బయలుదేరే సమయంలో అన్ని మేకలకు మాస్కులు కడతాడు. మేత సమయంలో మాత్రమే మాస్కులను తొలగించి తర్వాత మళ్లీ మాస్కులు కడుతున్నాడు. మేకలు వైరస్ బారిన పడితే తాను రోడ్డున పడతానని కోటయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. మనుషులకు కరోనా వస్తున్నట్టుగానే మేకలకూ వస్తుందని, అందుకే ఇలా మాస్క్ లు వేస్తున్నానని కోటయ్య వివరించాడు.

కోటయ్య పనిని కొందరు మెచ్చుకుంటున్నారు. ఆయన ముందుజాగ్రత్త చర్యలు బేష్ అంటున్నారు. ఈ మాత్రం ముందుజాగ్రత్త మనుషులకు లేకుండా పోవడం బాధాకరం అని వాపోతున్నారు. ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉంటూ మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటిస్తే కరోనాపై విజయం సాధించొచ్చని చెబుతున్నారు.