టోకెన్ల కోసం రైతుల కష్టాలు, తెల్లవారుజాము నుంచి పడిగాపులు

  • Published By: naveen ,Published On : November 16, 2020 / 04:19 PM IST
టోకెన్ల కోసం రైతుల కష్టాలు, తెల్లవారుజాము నుంచి పడిగాపులు

farmers difficulties for tokens: ధాన్యం కొనుగోలు టోకెన్ల కోసం కార్యాలయాలకు రైతులు భారీగా తరలివస్తున్నారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల, పాలకవీడు, గరిడేపల్లి మండలాల్లో .. టోకెన్ల కోసం రైతులు బారులు తీరారు. నేరేడుచర్లలో రైతులు తెల్లవారుజూము నుంచే వ్యవసాయాధికారి కార్యాలయం ఎదుట క్యూ కట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

సన్న ధాన్యం విక్రయాల కోసం రైతుల పడిగాపులు తప్పడం లేదు. నాగార్జున సాగర్ ఆయకట్టు పరిధిలోని చాలా మండలాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. మిర్యాలగూడలో సమస్యను పరిష్కరించేందుకు అధికారులు టోకెన్ల పద్ధతిని ప్రారంభించారు. కానీ క్షేత్ర స్థాయికి వచ్చేసరికి టోకెన్ల కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది.


https://10tv.in/farmers-suffering-for-the-sale-of-fine-grain/
సన్నధాన్యానికి మద్దతు ధర కల్పించాలని రైతుల ఆందోళన:
సన్నధాన్యానికి మద్దతు ధర కల్పించాలంటూ మెదక్‌ జిల్లా నార్సింగ్‌ దగ్గర ఎన్‌హెచ్‌ 44పై రైతులు ఆందోళనకు దిగారు. గంటకు పైగా వాహనాలు నిలిచిపోయాయి. పండించిన పంటకు ధర కల్పించడంలేదంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు రైతులు.