సన్నధాన్యం విక్రయం కోసం రైతులు కష్టాలు : టోకెన్ల కోసం గంటల తరబడి క్యూలైన్లలో నిల్చున్న మహిళా రైతులు

  • Published By: bheemraj ,Published On : November 13, 2020 / 12:11 PM IST
సన్నధాన్యం విక్రయం కోసం రైతులు కష్టాలు : టోకెన్ల కోసం గంటల తరబడి క్యూలైన్లలో నిల్చున్న మహిళా రైతులు

Farmers suffering : సన్నధాన్యం విక్రయం కోసం రైతులు కష్టాలు పడుతున్నారు. సూర్యపేట జిల్లాలో టోకెన్ల కోసం ఉదయం నుంచే కిలో మీటర్ల కొద్దీ బారులు తీరారు. టోకెన్ల కోసం గంటల తరబడి క్యూలైన్లలో మహిళా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నేరేడుచెర్ల, పాలకవీడు మండల వ్యవసాయ కార్యాలయాల ముందు భారీ క్యూలైన్లు కనిపిస్తున్నాయి.



గరిడేపల్లి ఏవో కార్యాలయం ముందు క్యూలైన్ లో నిలబడ లేక రైతులు తమ పాస్ బుక్కులను లైన్లుగా ఉంచారు. రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చినా అధికారులు మాత్రం ఒక రోజుకు ఒక మండలానికి 80 టోకెన్లు మాత్రమే జారీ చేస్తున్నారు.



నల్గొండ జిల్లా ఆయకట్టు పరిధిలో సన్నధాన్యం సాగు చేసినటువంటి రైతులు ఆరుగాలం కష్టపడి వాటిని విక్రయించుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత కొంతకాలంగా మిర్యాలగూడ పరిసర ప్రాంతాల్లో ఉన్న రైస్ మిల్లులకు భారీగా సన్న ధాన్యం వస్తోంది.



వేల ట్రాక్టర్లు రోడ్ల మీద ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ జామ్ అయి పెద్ద సమస్యగా మారిపోయింది.
ఆయకట్టు పరిధిలోని ప్రతి మండలానికి రోజుకు 80 టోకెన్లు ఇచ్చే విధంగా అధికారులు రెగ్యులేట్ చేశారు. అయితే 80 టోకెన్లతో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.