దారుణం.. కన్నకూతురిపై 3నెలలుగా తండ్రి అత్యాచారం, గర్భం దాల్చిన మైనర్ బాలిక

దారుణం.. కన్నకూతురిపై 3నెలలుగా తండ్రి అత్యాచారం, గర్భం దాల్చిన మైనర్ బాలిక

Ssc Student Raped In Kamareddy District

Father Rapes Daughter : ఆడపిల్లకు రక్షణ కరువైంది. వీధుల్లోనే కాదు ఇంట్లోనూ అదే పరిస్థితి. బయటి వారే కాదు రక్తసంబంధీకులు సైతం కామంతో కళ్లు మూసుకుపోయి అత్యాచారాలకు తెగబడుతున్నారు. వావి వరుసల మరిచి కామ కోరికలు తీర్చుకుంటున్నారు. సభ్య సమాజం తలదించుకునే అలాంటి దారుణం ఒకటి నల్గొండ జిల్లాలో జరిగింది.

ఇంట్లోనే ఉంటున్న కూతురిపై 3 నెలలుగా లైంగిక దాడి:
కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే కామాంధుడిగా మారాడు. ఏ తండ్రి చేయకూడని పాడు పని చేశాడు. కూతురుపై అత్యాచారం చేశాడు. ఇలా మూడు నెలలుగా ఇదే నీచం. బాలిక గర్భం దాల్చడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం వర్కాల గ్రామానికి చెందిన వ్యక్తికి 13ఏళ్ల కూతురు ఉంది.

డిండిలోని ఓ స్కూల్ లో 9వ తరగతి చదివుతోంది. కరోనా నేపథ్యంలో స్కూల్ మూసివేయడంతో ఆ బాలిక ఇంటి దగ్గరే ఉంటోంది. ఈ క్రమంలో కూతురిపై తండ్రి కన్నుపడింది. కూతురిని బలవంతంగా లోబర్చుకున్నాడు. లైంగిక దాడికి పాల్పడ్డాడు. బయటికి చెబితే చంపేస్తా అని బెదిరించడంతో బాలిక నోరు విప్పలేదు. మౌనంగా ఆ ఘోరాన్ని భరించింది.

గర్భం దాల్చడంతో బయటపడిన దారుణం:
ఇటీవల బాలిక అనారోగ్యానికి గురైంది. అయితే తనకేమీ తెలియదన్నట్టు తండ్రి వ్యవహరించాడు. భార్యతో కలసి కూతురును దేవరకొండలోని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. వైద్య పరీక్షల్లో బాలిక గర్భం దాల్చినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీంతో తల్లి షాక్ తింది. ఇంటికి వచ్చాక కూతురిని నిలదీసింది. దీంతో తండ్రి నిర్వాకం బయటపడింది. ఆ తర్వాత అతడు మరింత రెచ్చిపోయాడు.

ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని తల్లీకూతుళ్లను చితకబాదాడు. ఇంట్లోనే బంధించాడు. చివరికి ఆ బాలిక ఎలాగో బయటపడింది. పోలీసులకు సమాచారం ఇచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కామంతో కళ్లు మూసుకుపోయి కూతురితో నీచంగా వ్యవహరించిన ఆ కామాంధుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు.