పండుగల ప్రత్యేక రైళ్ల వివరాలు

  • Published By: madhu ,Published On : October 15, 2020 / 06:20 AM IST
పండుగల ప్రత్యేక రైళ్ల వివరాలు

festival special trains  : పండుగల సీజన్ వచ్చేస్తోంది. సొంత గ్రామాలకు వెళ్లేందుకు ప్రజలు సిద్ధమౌతున్నారు. ఈ సందర్భంగా…దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. అక్టోబర్‌ 20 నుంచి నవంబర్‌ 30 వరకు నిత్యం నడిచే రైళ్ల వివరాలను అధికారులు వెల్లడించారు.



లింగంపల్లి – కాకినాడ పోర్ట్‌ స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌, లింగంపల్లి స్టేషన్‌లో రాత్రి 8.30కి బయలుదేరి మరుసటి ఉదయం 7.20కి కాకినాడ చేరుకుంటుంది. తిరిగి కాకినాడలో రాత్రి 7.10కి బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 6.05కు లింగంపల్లి చేరుకుంటుంది. బేగంపేట, సికింద్రాబాద్, భువనగిరి, కాజీపేట, వరంగల్, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు, రాజమండ్రి మీదుగా వెళుతుంది.



లింగంపల్లి – తిరుపతి : లింగంపల్లిలో సాయంత్రం 5.30కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరిగి..తిరుపతిలో సాయంత్రం 6.25కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.55కు లింగంపల్లి చేరుకుంటుంది. బేగంపేట, సికింద్రాబాద్, బీబీనగర్, నల్లగొండ, నడికుడి, గుంటూరు, ఒంగోలు, శ్రీకాళహస్తి, రేణిగుంట మీదుగా ప్రయాణిస్తాయి.



అక్టోబర్‌ 22 నుంచి నవంబర్‌ 30 వరకు
తిరుపతి–అమరావతి (మహారాష్ట్ర) : తిరుపతిలో మధ్యాహ్నం 3.10కి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 2.50కి అమరావతి చేరుకుంటుంది. అమరావతిలో ఉదయం 6.45కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.40కి తిరుపతి చేరుకుంటుంది. పాకాల, మదనపల్లి, కదిరి, ధర్మవరం, అనంతపురం, కర్నూలు, గద్వాల, మహబూబ్‌నగర్, కాచిగూడ, కామారెడ్డి, నిజామాబాద్, ధర్మాబాద్‌ల మీదుగా ప్రయాణిస్తుంది.



అక్టోబర్‌ 23 నుంచి నవంబర్‌ 30 వరకు :
లింగంపల్లి–నర్సాపూర్‌ : లింగంపల్లిలో రాత్రి 9.05కు బయలుదేరి మరుసటి రోజు 7.45కు నర్సాపూర్‌ చేరుకుంటుంది. తిరిగి…నర్సాపూర్‌లో సాయంత్రం 6.55కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.50కి లింగంపల్లికి చేరుకుంటుంది. బేగంపేట, సికింద్రాబాద్, నల్లగొండ, విజయవాడ, గుడివాడ, భీమవరం, పాలకొల్లు మీదుగా ప్రయాణిస్తాయి.