Fever Survey: తెలంగాణలో మూడో రోజుకు చేరుకున్న ఫీవర్ సర్వే

తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న ఫీవర్ సర్వే ఆదివారం నాడూ కొనసాగింది. వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు.

Fever Survey: తెలంగాణలో మూడో రోజుకు చేరుకున్న ఫీవర్ సర్వే

Fever

Fever Survey: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టడమే లక్ష్యంగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ముమ్మర చర్యలు తీసుకుంది. రాష్టంలో ఓమిక్రాన్, కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో అప్రమత్తమైన వైద్యారోగ్యశాఖ ముందుజాగ్రత్త చర్యగా అన్ని జిల్లాల్లో ఫీవర్ సర్వే నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించింది. ఇంటింటికి ఆరోగ్యం పేరుతో శుక్రవారం తెలంగాణ వ్యాప్తంగా ఫీవర్ సర్వే ప్రారంభం కాగా.. ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని మంత్రి హరీష్ రావు వెల్లడించారు.

Also read: Crime Hyderabad: నగరంలో వేర్వేరు ఘటనల్లో ఇద్దరు యువకులపై కత్తులతో దాడి

శనివారం స్వయంగా మంత్రి ఫీవర్ సర్వే జరుగుతున్న తీరును పరిశీలించి వైద్యసిబ్బందికి సూచనలు చేసారు. తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న ఫీవర్ సర్వే ఆదివారం నాడూ కొనసాగింది. వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలు ఉన్నవారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. స్వల్ప లక్షణాలు ఉంటే వైద్యుల సూచనల మేరకు హోమ్ ఐసొలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అందు కోసం ఇప్పటికే వైద్యారోగ్యశాఖ సిద్ధం చేసిన హోమ్ ఐసోలేషన్ కిట్స్ ను బాధితులకు అందిస్తున్నారు.

Also read: Viral Video: నీటిలో మునుగుతున్న జింకపిల్లను కాపాడిన శునకం

కరోనా నిర్ధారణ అయిన వారిని స్థానిక వైద్యాధికారుల పర్యవేక్షణలో ఆసుపత్రికి తరలిస్తున్నారు. కాగా శుక్ర, శని వారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 29 లక్షల 26 వేల ఇళ్లలో ఫివర్ సర్వే నిర్వహించగా 1 లక్షా 28 వేల మందికి కోవిడ్ లక్షణాలున్నట్లు గుర్తించారు. లక్షా 27 వేల 372 మందికి హోమ్ ఐసోలేషన్ కిట్స్ అందజేసినట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది.

Also read: India’s Tallest Man: భారత్ లో అత్యంత పొడగరి సమాజ్ వాదీ పార్టీలోకి