Sarath Kumar Meet Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో సినీ నటుడు శరత్ కుమార్ భేటీ

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సినీ నటుడు, ఆలిండియా సమతువ మక్కల్ కచ్చి అధ్యక్షుడు శరత్ కుమార్ మర్యాద పూర్వకంగా కలిశారు. దేశ రాజకీయాల గురించి కవితతో శరత్ కుమార్ చర్చించారు.

Sarath Kumar Meet Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సినీ నటుడు, ఆలిండియా సమతువ మక్కల్ కచ్చి అధ్యక్షుడు శరత్ కుమార్ మర్యాద పూర్వకంగా కలిశారు. దేశ రాజకీయాల గురించి కవితతో శరత్ కుమార్ చర్చించారు. బీఆర్ఎస్ పార్టీ స్థాపన, ఉద్ధేశం, లక్ష్యాలు, ఎజెండా లాంటివి అంశాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలం కావాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్.. బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశారు.  కవిత కూడా బీఆర్ఎల్ లో యాక్టివ్ గా రోల్ పోషిస్తున్నారు. గత కొన్ని రోజులుగా వివిధ రాష్ట్రాల ప్రతినిధులతో ఆమె చర్చలు జరుపుతున్నారు.

ఈ రోజు ఉదయం కవిత నివాసంలో ప్రముఖ సినీ నటుడు శరత్ కుమార్ భేటీ అయ్యారు. బీఆర్ఎస్ లక్ష్యాలు ఏంటీ, రాబోయే రాజుల్లో ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తుందన్న అంశాలపై
ఇద్దరు చర్చించారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీతో కలిసి శరత్ కుమార్ పని చేసే అవకాశం కనిపిస్తోంది. తమిళనాడు లో ఇప్పటివరకు స్టాలిన్ మాత్రమే కేసీఆర్ తో టచ్ లో ఉన్నారు. ఇప్పుడు శరత్ కుమార్ కూడా బీఆర్ఎస్ టచ్ లోకి వచ్చారు. బీఆర్ఎస్ పార్టీతో కలిసి పని చేసే అవకాశం ఉంది.

Indrakaran reddy: మహారాష్ట్రలో బీఆర్ఎస్ స‌భ నిర్వ‌హించ‌నున్న నేప‌థ్యంలో నేడు నాందేడ్ కు తెలంగాణ మంత్రి

బీఆర్ఎస్ పార్టీ జాతీయ విస్తరణలో భాగంగా అన్ని రాష్ట్రాల నుంచి వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజా ప్రతినిధులు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తో కొంతమంది సంప్రదింపులు జరుపుతున్నారు. కీలక నేతలో మరికొంత మంది సంప్రదింపులు జరుపుతున్నారు. కలిసి వచ్చే రాజకీయ పార్టీలు, ప్రముఖులు, ప్రజా ఉద్యమ నేతలందరినీ కలుపుకుని ముందుకు వెళ్లాలని బీఆర్ఎస్ అడుగులు వేస్తోంది.

ట్రెండింగ్ వార్తలు