అమ్రాబాద్ అటవీప్రాంతంలో అగ్నిప్రమాదం..మంటల్లో చిక్కుకున్న చెంచులు

నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు అగ్నికీలల్లో చిక్కుకున్న నలుగురు చెంచులకు గాయాలయ్యాయి.

అమ్రాబాద్ అటవీప్రాంతంలో అగ్నిప్రమాదం..మంటల్లో చిక్కుకున్న చెంచులు

Fire accident in Amrabad forest : నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు అగ్నికీలల్లో చిక్కుకున్న నలుగురు చెంచులకు గాయాలయ్యాయి. అటవీ ఉత్పత్తుల సేకరణకు వెళ్లిన వీరు అగ్నికీలల్లో చిక్కుకున్నారు.

ఈ సమాచారం అందుకున్న అటవీ అధికారులు ఘటనాస్థలానికి చేరుకొని గాయపడిన వారిని చికిత్స కోసం అచ్చంపేట ఆసుపత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

గత సోమవారం రాత్రి సైతం దోమలపెంట సమీపంలో అడవికి నిప్పంటుకుంది. వెంటనే రెండు అటవీశాఖ బృందాలతో పాటు 10 మంది అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని బ్లోయర్లు, డౌసింగ్‌ల సాయంతో మంటల్ని అదుపులోకి తెచ్చారు. గడ్డికి నిప్పంటుకోవడంతో మంటలు వ్యాపించి అడవికి నష్టం వాటిల్లింది.