Oxygen Tankers Train : ఆక్సిజన్ ట్యాంకర్ల రైలులో అగ్నిప్రమాదం

ఆక్సిజన్ ట్యాంకర్లతో వెళుతున్న గూడ్స్ రైలులో అగ్నిప్రమాదంసంభవించింది. అధికారులు వెంటనే గుర్తించి మంటలను ఆర్పివేయటంతో ప్రమాదం తప్పింది.

Oxygen Tankers Train : ఆక్సిజన్ ట్యాంకర్ల రైలులో అగ్నిప్రమాదం

Oxygen Tankers Train

Oxygen Tankers Train : ఆక్సిజన్ ట్యాంకర్లతో వెళుతున్న గూడ్స్ రైలులో అగ్ని ప్రమాదం  సంభవించింది. అధికారులు వెంటనే గుర్తించి మంటలను ఆర్పివేయటంతో ప్రమాదం తప్పింది.  హైదరాబాద్ నుంచి చత్తీస్ గఢ్ లోని రాయపూర్ కు ఆరు ఆక్సిజన్ ట్యాంకర్లతో గూడ్స్ రైలు బయలు దేరింది.

శనివారం పెద్దపల్లి జిల్లా చీకురాయి రైల్వే స్టేషన్ సమీపంలోకి చేరుకోగానే ఆరు ట్యాంకర్ల లోని ఒక ట్యాంకర్  నుంచి మంటలు చెలరేగాయి. మంటలు గుర్తించిన రైల్వే సిబ్బంది అధికారులకు సమాచారం అందించారు.  వెంటనే వారు పెద్దపల్లి సమీపంలోని 38వ గేటు వద్ద రైలును నిలిపి వేసి మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు.

అగ్ని ప్రమాదానికి ఆక్సిజన్ లీకై మంటలు చెలరేగినట్లు అధికారులు భావిస్తున్నారు. మంటలను అదుపులోకి  తెచ్చే లోపే ఒక ట్యాంకర్ పూర్తిగా దగ్దం కాగా.. మరో 5 ట్యాంక్ లు సురక్షితంగానే  ఉన్నాయని రైల్వే అధికారులు తెలిపారు.