Fire In Telangana New Secretariat : కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదం.. సీఎం కేసీఆర్ సీరియస్

కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదంపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కొత్త సెక్రటేరియట్ లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదా? అంటూ సీరియస్ అయ్యారు.

Fire In Telangana New Secretariat : కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదం.. సీఎం కేసీఆర్ సీరియస్

Fire In Telangana New Secretariat : కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదంపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. మంత్రి ప్రశాంత్ రెడ్డితో సీఎం మాట్లాడారు. ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదని మంత్రి ప్రశాంత్ రెడ్డి సీఎం కేసీఆర్ కు తెలిపారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కొత్త సెక్రటేరియట్ లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదా? అంటూ సీరియస్ అయ్యారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా దృష్టి పెట్టాలని కేసీఆర్ సూచించారు. సెక్రటేరియట్ నిర్మాణం పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు.

Also Read..Telangana New Secretariat: తెలంగాణ చరిత్రను ప్రతిభింబించేలా నూతన సచివాలయం.. ఆర్కిటెక్ట్‌లు ఏం చెప్పారంటే ..

సచివాలయ ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీశారు. అగ్నిప్రమాదం ఎలా జరిగింది? దానికి కారణాలు ఏంటి? ఈ విషయాలపై మంత్రి ప్రశాంత్ రెడ్డికి ఫోన్ చేసిన మరీ అడిగి తెలుసుకున్న కేసీఆర్. సచివాలయం నిర్మాణం జరుగుతున్న సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎలాంటి నిర్లక్ష్యం తగదన్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగినట్లు.. మంత్రి ప్రశాంత్ రెడ్డి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. మరోసారి ఇలాంటి ఘటనలు రిపీట్ అవకుండా చూడాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు. నిర్మాణ సమయంలో తీసుకోవాల్సి జాగ్రత్తలపై సంస్థ కానీ, అధికారులు కానీ కఠినంగా ఉండాలని.. ఎలాంటి ప్రమాదాలు, తప్పిదాలు జరక్కుండా చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చి చెప్పారు.

హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర ప్రారంభానికి సిద్ధమవుతున్న సమయంలో తెలంగాణ నూతన సచివాలయంలో అగ్ని ప్రమాదం వార్తలు కలకలం సృష్టించాయి. శుక్రవారం తెల్లవారుజామున సచివాలయం భవనం నుంచి దట్టమైన పొగలు వచ్చాయి. 11 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. సచివాలయ సమీపంలోకి పోలీసులు ఎవ్వరినీ అనుమతించ లేదు. దట్టమైన పొగల ధాటికి సెక్రటేరియట్ వెనుక భాగంలోని ఓ గుమ్మటం నల్లగా మారింది.

Also Read..Fire Broke Out : తెలంగాణ నూతన సచివాలయంలో అగ్నిప్రమాదం

తెలంగాణ ప్రభుత్వం నూతనంగా నిర్మిస్తున్న సచివాలయంలో తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం సంభవించింది. కొత్త సచివాలయం మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. భవనం కుడివైపు కాసేపు మంటలు చెలరేగాయి.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

షార్ట్ సర్క్యూట్ కారణంగానే కొత్త సచివాలయంలో మంటలు చెలరేగినట్లు అధికారులు భావిస్తున్నారు. మంటలు చెలరేగిన వెంటనే ఎన్ టీఆర్ మార్గ్ రోడ్డును రెండు వైపులా మూసివేశారు. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉడ్ వర్క్ జరుగుతున్న చోట షార్ట్ సర్క్యూట్ కావడం వల్ల అగ్నిప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. సచివాలయం మొదటి ఫ్లోర్ వరకు మంటలు వ్యాపించడంతో పాటు దట్టమైన పొగలు అలుముకున్నాయి. కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదానికి కారణాలపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు.