Secunderabad: సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. మంటలు అదుపు చేయలేకపోతున్న సిబ్బంది

అగ్నిమాపక సిబ్బంది క్రేన్ల సహాయంతో ఇప్పటివరకు ఐదుగురిని కాపాడారు. ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. కొద్దిసేపటి వరకు మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ, సెల్లార్ నుంచి మంటలు తిరిగి ప్రారంభమయ్యాయి. దీంతో మంటలు ఆర్పడం కష్టమవుతోంది.

Secunderabad: సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. మంటలు అదుపు చేయలేకపోతున్న సిబ్బంది

Secunderabad: సికింద్రాబాద్, రాంగోపాల్‌పేటలో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఉదయం 11.00 గంటల సమయంలో డెక్కన్ నిట్వేర్ స్పోర్ట్స్ షాపులో అగ్ని ప్రమాదం సంభవించింది. సెల్లార్ వన్‌లో మొదలైన మంటలు క్రమంగా పై అంతస్థులకు వ్యాపించాయి. ఘటన సమచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు.

Talibans ‘Mada 9’ Super Car : ‘Mada 9’ సూపర్ కారు తయారు చేసిన తాలిబన్లు .. అప్ఘానిస్థాన్ చరిత్రలో తొలి స్పోర్ట్స్ కారు ..

అగ్నిమాపక సిబ్బంది క్రేన్ల సహాయంతో ఇప్పటివరకు ఐదుగురిని కాపాడారు. ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. కొద్దిసేపటి వరకు మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ, సెల్లార్ నుంచి మంటలు తిరిగి ప్రారంభమయ్యాయి. దీంతో మంటలు ఆర్పడం కష్టమవుతోంది. మరింత భారీగా మంటలు వ్యాపిస్తున్నాయి. మరోవైపు భారీ పొగ కూడా వెలువడుతోంది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. బిల్డింగ్ ఎల్ ఆకారంలో ఉండటం వల్ల కూడా సహాయక చర్యలు కష్టమవుతున్నాయి. మళ్లీ వ్యాపిస్తున్న మంటల కారణంగా పక్క బిల్డింగు, వెనుకవైపు బిల్డింగులకు కూడా మంటలు అంటుకుంటున్నాయి. అగ్ని ప్రమాదం సంభవించిన బిల్డింగ్ లోపల మరింత మంది చిక్కుకుని ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

Telangana : ఐదేళ్ల క్రితం నరేశ్ హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు..

ఈ క్రమంలో లోపల ఎవరైనా చిక్కుకుని ఉంటే వారిని రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది ఆక్సిజన్ మాస్కులు ధరించి బిల్డింగులోకి చేరుకున్నారు. అగ్ని ప్రమాద స్థలానికి చేరుకున్న మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అక్కడి పరిస్థితిని సమీక్షించారు. ఘటన గురించి మీడియాకు వివరించారు. ‘‘అగ్ని ప్రమాదంలో కొంత మందిని సిబ్బంది రక్షించారు. లోపల ఇద్దరు చిక్కుకున్నట్లు అనుమానం ఉంది. వారికి ఫోన్ చేసినా రెస్పాండ్ కావడం లేదు. అధికారులు ఘటనా స్థలంలోనే ఉండి అన్ని ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. 2-3 గంటల్లో పరిస్థితి చక్కబడే అవకాశం ఉంది. బిల్డింగ్ మొత్తం మెటీరియల్‌తో నింపేశారు. లోపల 10 వేల తాళ్లున్నాయి’’ అని తలసాని చెప్పారు.