Inspections Clubs : గ్రేటర్ హైదరాబాద్‌లోని 11 క్లబ్బుల్లో ఫైర్ సిబ్బంది తనిఖీలు

సికింద్రాబాద్‌తో పాటు హైదరాబాద్ పరిధిలోని క్లబ్‌ల్లోనూ తనిఖీలు జరుగుతున్నాయి. జూబ్లీహిల్స్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌లో ఫైర్ సేఫ్టీ అధికారులు తనిఖీలు జరుపుతున్నారు.

Inspections Clubs : గ్రేటర్ హైదరాబాద్‌లోని 11 క్లబ్బుల్లో ఫైర్ సిబ్బంది తనిఖీలు

Clubs

Fire Staff inspections clubs : సికింద్రాబాద్ క్లబ్ లో అగ్నిప్రమాదంతో అగ్నిమాపక విభాగం అప్రమత్తమయింది. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న క్లబ్‌లో ఫైర్ సిబ్బంది రెండ్రోజుల పాటు తనిఖీలు జరిపారు. ఫైర్ సేఫ్టీ లేని క్లబ్‌లకు నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఫైర్ సేఫ్టీ కచ్చితంగా అమలు చేయాలని క్లబ్ యాజమాన్యానికి సూచించారు. సికింద్రాబాద్‌లోని సేల్ ఇన్ క్లబ్, కంట్రీ క్లబ్, సికింద్రాబాద్ క్లబ్, డెక్కన్ క్లబ్‌లో ఫైర్ సిబ్బంది ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

కంట్రీ క్లబ్, డెక్కన్ క్లబ్ ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు పాటిస్తున్నట్టు తనిఖీల్లో గుర్తించారు. సికింద్రాబాద్‌తో పాటు హైదరాబాద్ పరిధిలోని క్లబ్‌ల్లోనూ తనిఖీలు జరుగుతున్నాయి. జూబ్లీహిల్స్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌లో ఫైర్ సేఫ్టీ అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. ఫైర్ సేఫ్టీ అధికారి ప్రసాద్ నేతృత్వంలో fnccలో తనిఖీలు సాగుతున్నాయి.

Telangana High Court: ప్రభుత్వ శాఖల్లో కొందరు ఉద్యోగులకు పోస్టింగులు ఇవ్వకపోవడంపై హైకోర్టు విచారణ

సికింద్రాబాద్ క్లబ్ ప్రమాదం షార్ట్ సర్క్యూట్‌ కారణంగా జరిగినప్పటికీ..అసలు క్లబ్బులు ఎంత మేర భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నాయన్న ప్రశ్నా తలెత్తింది. ఫైర్ సేఫ్టీ అధికారులు ఈ దిశగానే చర్యలు ప్రారంభించారు. గ్రేటర్ హైదరాబాద్‌లో మొత్తం 11 ప్రముఖ క్లబ్బులున్నాయి. వాటన్నింటిలోనూ తనిఖీలు జరిపారు. అయితే అధికారుల తనిఖీల్లో నివ్వెరపరిచే విషయాలు వెలుగుచూశాయి. ఒక్క క్లబ్బులోనూ సరైన అగ్నిమాపక వ్యవస్థ కనిపించలేదు.

క్లబ్బులో ఫంక్షన్లు, ఇతర కార్యక్రమాలు జరుగుతుండడం, పెద్ద సంఖ్యలో జనం గుమికూడుతుండడం వంటివి ఉన్నా..భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం అధికారులను ఆశ్చర్యపరిచింది. క్లబ్బులకు నోటీసులు జారీచేసేందుకు సిద్ధమయ్యారు. పటిష్టమైన అగ్నిమాపక వ్యవస్థ ఏర్పాటుచేయాలని ఆదేశించనున్నారు. అలాగే విద్యాసంస్థల భవనాలు, సినిమా హాళ్లు, ఫంక్షన్ హాళ్లు వంటివీ అగ్నిమాపక వ్యవస్థలు ఏర్పాటుచేయాలని ఆదేశించనున్నారు.

Corona Positive : తెలంగాణలో కరోనా విజృంభణ.. బీఆర్‌కే భవన్‌లో ఐఏఎస్‌లు, ఉద్యోగులు.. పోలీసులకు పాజిటివ్

జూబ్లిహిల్స్ క్లబ్, జింఖానా క్లబ్, ఫిల్మ్‌ నగర్ క్లబ్‌లో ఆకస్మిక తనిఖీలు జరిపామని హైదరాబాద్ ఫైర్ సేఫ్టీ ప్రాంతీయ అధికారి ప్రసాద్ చెప్పారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్, సెల్లార్ లిఫ్ట్, క్యారీ డోర్స్ లాన్ థియేటర్స్, ఆటోమేటిక్ ఫైల్ సిస్టం వంటి అంశాలపై దృష్టి పెట్టామని తెలిపారు.