Fake CBI Officers Gang : సీబీఐ అధికారులమంటూ వచ్చి ఇంట్లో లూఠీ చేసిన దొంగలు

హైదరాబాద్ నగరంలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు.  సీబీఐ అధికారులమంటూ వచ్చి 1.2 కేజీల బంగారం రూ.2 లక్షల నగదు దోచుకెళ్లారు. ఈ ఘటన గచ్చిబౌలి నానక్ రాంగూడలో చోటుచేసుకుంది

Fake CBI Officers Gang : సీబీఐ అధికారులమంటూ వచ్చి ఇంట్లో లూఠీ చేసిన దొంగలు

Hyderabad Crime (6)

Fake CBI Officers Gang :  హైదరాబాద్ నగరంలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు.  సీబీఐ అధికారులమంటూ వచ్చి 1.2 కేజీల బంగారం రూ.2 లక్షల నగదు దోచుకెళ్లారు. ఈ ఘటన గచ్చిబౌలి నానక్ రాంగూడలో చోటుచేసుకుంది. భువన తేజా ఇన్ఫ్రా చైర్మన్ సుబ్రహ్మణ్యం ఇంట్లోకి ఐటి, సీబీఐ అధికారులమని చెప్పిన ఐదుగురు వ్యక్తులు వచ్చారు.
ఇంట్లో దాదాపు గంటన్నరపాటు తనికీలు చేశారు. లాకర్ కీస్ తీసుకోని బంగారం, డబ్బుతో ఉడాయించారు. అయితే ఐటీ, సీబీఐ దాడి జరిగినప్పుడు అధికారులు వెళ్లే సమయంలో నోటీసులు ఇస్తారు.. కానీ వచ్చిన వారు నోటీసులు ఇవ్వకుండా వెళ్లిపోవడంతో మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు.  బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మొత్తం ఐదుగురు వ్యక్తులు ఈ దొంగతనంలో పాల్గొన్నట్లు గుర్తించారు పోలీసులు. వారిని గుర్తించేందుకు సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.
అయితే ఇటీవల సుబ్రహ్మణ్యం ఓ స్టార్ హోటల్ లో  భువన తేజా వెంచర్స్ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీకి నగరానికి చెందిన చాలామంది రియల్టర్లు హాజరయ్యారు. విరిలోనే ఎవరైనా ఆ పని చేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. పార్టీ జరిగిన రోజు ఫుటేజ్.. దొంగతనం జరిగిన ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు పోలీసులు. త్వరలో దొంగలను పట్టుకుంటామని హామీ ఇచ్చారు.