Floating Rock: హైదరాబాద్‌‌లో అద్భుతం.. గాల్లో తేలుతున్న రాళ్లు

హైదరాబాద్ లోని మోజంజాహీ (ఎంజే) మార్కెట్ జంక్షన్ రోడ్ లో ఓ రాతి శిల్పం కొత్త అట్రాక్షన్ గా నిలిచింది. ఇందులో ప్రత్యేకత ఏంటంటే.. ఆ శిల్పం రెండు రాళ్లు గాల్లో తేలుతున్నట్లుగా చెక్కారు.

Floating Rock: హైదరాబాద్‌‌లో అద్భుతం.. గాల్లో తేలుతున్న రాళ్లు

Floating Stones Mj Market

Floating Rock: హైదరాబాద్ లోని మోజంజాహీ (ఎంజే) మార్కెట్ జంక్షన్ రోడ్ లో ఓ రాతి శిల్పం కొత్త అట్రాక్షన్ గా నిలిచింది. ఇందులో ప్రత్యేకత ఏంటంటే.. ఆ శిల్పం రెండు రాళ్లు గాల్లో తేలుతున్నట్లుగా చెక్కారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) దీనిని ఏర్పాటు చేసి బాటసారులను ఆశ్చర్యపరుస్తోంది.

చాలా మందికి అసలు విషయం తెలియక కళ్లప్పగించి చూస్తున్నా.. ఎవరికీ అర్థం కావడం లేదు. విదేశాల్లో కనిపించే ఇలాంటి టెక్నిక్ హైదరాబాద్ లో కూడా కనిపిస్తుండటం మరింత మందిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. నిజానికి వాటిని అతికించరు. ఎటువంటి మాయాజాలం కూడా వాడలేదు అని జీహెచ్ఎంసీ డిప్యూటీ ఇంజినీర్ కొడిదల్ వెంకట్ నారాయణ అంటున్నారు.

Floating Rocks

Floating Rocks

గాల్లో తేలుతున్న సీక్రెట్
సిటీలో ఉండే అకల్ప్ ముకీమ్ అనే వ్యక్తి శిల్పం గురించి ఇలా అంటున్నారు. ఈ శిలలు గాల్లో తేలుతున్నట్లు ఉండటానికి సీక్రెట్.. అవి ఫైబర్, గ్లాస్ మెటేరియల్ తో పాటు స్టీల్ పైప్ తో నిర్మించారు. అవి సపోర్టింగ్ నిలబడటంతో రెండు పెద్ద బండరాళ్లను గాల్లో తేలుతున్నట్లుగా కనిపిస్తుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేయడంతో అచ్ఛం బండరాళ్లలాగే కనిపిస్తున్నాయి.

ఇదంతా డిజైనింగ్ లో ఉన్న టెక్నిక్సేనని ఈ మొత్తం రెడీ చేయడానికి దాదాపు 20రోజుల సమయం పట్టిందని చెబుతున్నారు. ఎప్పుడూ బిజీగా ఉండే ఎమ్జే మార్కెట్ ప్రాంతంలో ఇది మరో అట్రాక్షన్ గా నిలిచింది.