Food Poison : చికెన్ గ్రేవీతో వంకాయ కర్రీ.. సిద్దిపేట గురుకుల పాఠశాల‌లో 120మందికి ఫుడ్ పాయిజ‌న్

ఆదివారం మధ్యాహ్నం విద్యార్థులకు చికెన్ తో భోజనం వడ్డించారు. మిగిలిన గ్రేవీని రాత్రిపూట వండిన వంకాయ కూరలో కలిపి విద్యార్థులకు వడ్డించారు. దీంతో అర్థరాత్రి నుంచి పిల్లలు అస్వస్థతకు గురయ్యారు.

Food Poison : చికెన్ గ్రేవీతో వంకాయ కర్రీ.. సిద్దిపేట గురుకుల పాఠశాల‌లో 120మందికి ఫుడ్ పాయిజ‌న్

Food Poison

Food Poison : సిద్ధిపేట‌లోని ఇస్లామియా మైనారిటీ గురుకుల బాలికల పాఠ‌శాల‌ నిర్వహకుల నిర్లక్ష్యం వందమందికి పైగా విద్యార్థినుల ప్రాణాల మీదకు తెచ్చింది. ఫుడ్ పాయిజన్ కారణంగా 120 మంది విద్యార్థులు అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. వీరిని చికిత్స నిమిత్తం ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న మంత్రి హ‌రీశ్ రావు అధికారుల‌ను ఆరా తీశారు. విద్యార్థుల‌కు మెరుగైన వైద్యం అందించాల‌ని ఆదేశించారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

ఆదివారం మధ్యాహ్నం విద్యార్థులకు చికెన్ తో భోజనం వడ్డించారు. మిగిలిన గ్రేవీని రాత్రిపూట వండిన వంకాయ కూరలో కలిపి విద్యార్థులకు వడ్డించారు. దీంతో అర్థరాత్రి నుంచి పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచ‌నాలు చేసుకున్నారు. సోమవారం నాటికి వారికి క‌డుపు నొప్పి తీవ్రం కావ‌డంతో వైద్య సిబ్బందిని పిలిపించి స్కూల్ లోనే పిల్లలకు వైద్యం అందించారు. ఈ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే, సోమవారం మధ్యాహ్నం నుంచి పిల్లల్లో చాలామంది వాంతులు, విరేచనాలతో బాధపడుతుండటంతో ఆసుపత్రికి తరలించక తప్పలేదు.

Andra Pradesh : వికటించిన మధ్యాహ్న భోజనం..42 మంది విద్యార్థులకు అస్వస్థత

ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే మంత్రి హరీశ్ రావు స్పందించారు. విషయం తెలిసినప్పటి నుండి పర్యవేక్షిస్తున్నారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా వైద్యాధికారి కాశీనాథ్ ని ఆదేశించారు. పూర్తిస్థాయిలో కోలుకునే వరకు డాక్టర్లు పర్యవేక్షణ చేయాలని మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. ఫుడ్ పాయిజన్ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేదని, తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దని ధైర్యం చెప్పారు మంత్రి హరీశ్ రావు.

టూత్ పేస్ట్‌లో పాయిజన్ అంట.. జర జాగ్రత్త!