Food Poison : బాబోయ్.. పిల్లలకు బల్లి పడిన ఆహారం వడ్డించిన హాస్టల్ సిబ్బంది.. 40మందికి అస్వస్థత.. గురుకుల ఆశ్రమ పాఠశాలలో దారుణం

హాస్టల్ సిబ్బంది బాలికలకు బల్లి పడిన ఆహారం వడ్డించారు. దీంతో 40 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.

Food Poison : బాబోయ్.. పిల్లలకు బల్లి పడిన ఆహారం వడ్డించిన హాస్టల్ సిబ్బంది.. 40మందికి అస్వస్థత.. గురుకుల ఆశ్రమ పాఠశాలలో దారుణం

Food Poison : వరంగల్ జిల్లా వర్ధన్నపేట ప్రభుత్వ బాలికల గురుకుల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. హాస్టల్ సిబ్బంది బాలికలకు బల్లి పడిన ఆహారం వడ్డించారు. దీంతో 40 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. 25 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురవగా, వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

ప్రభుత్వ బాలికల గురుకుల ఆశ్రమ పాఠశాల వర్దన్నపేట మండలం కేంద్రంలో ఉంది. బల్లి పడిన ఆహారం తినడంతో పిల్లలకు వాంతులు, విరేచనాలు అయ్యాయి. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. హాహాకారాలు చేశారు. దీనిపై అడిషనల్ కలెక్టర్ స్పందించారు. ఆసుపత్రికి వెళ్లిన అడిషనల్ కలెక్టర్ విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అలాగే వారికి అందుతున్న వైద్యం గురించి వివరాలు అడిగారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందేలా ఆయన చర్యలు తీసుకున్నారు.

విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసి వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లల ఆరోగ్య పరిస్థితి ఏంటో తెలియక కంగారుపడుతున్నారు.

విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసి వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లల ఆరోగ్య పరిస్థితి ఏంటో తెలియక కంగారుపడుతున్నారు. కాగా, నిర్లక్ష్యంగా వ్యవహరించిన హాస్టల్ సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. పిల్లలకు వడ్డించే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే సిబ్బంది అవేమీ పట్టించుకోలేదు. బల్లి పడిన ఆహారం వడ్డించడం వల్ల ఇంత ఘోరం జరిగిపోయింది.