ఆకాశవాణి మాజీ న్యూస్ రీడర్ మాడపాటి సత్యవతి కన్నుమూత..సీఎం కేసీఆర్ సంతాపం

  • Published By: madhu ,Published On : March 4, 2020 / 04:51 AM IST
ఆకాశవాణి మాజీ న్యూస్ రీడర్ మాడపాటి సత్యవతి కన్నుమూత..సీఎం కేసీఆర్ సంతాపం

ఆకాశవాణి మాజీ న్యూస్ రీడ్ శ్రీమతి మాడపాటి సత్యవతి మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు 2020, మార్చి 04వ తేదీ ఉదయం ట్విట్టర్ వేదికగా తెలంగాణ CMO ట్వీట్ చేసింది. సుమారు నాలుగు దశాబ్దాల పాటు మాడపాటి సత్యవతి తన సుస్వరంతో రేడియో వార్తలు చదువుతూ, తన హితులకు, సన్నిహితులకు మాత్రమే కాకుండా, లక్షలాది మంది శ్రోతల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న వ్యక్తిగా ఆమె సేవలను సీఎం గుర్తు చేసుకున్నారని వెల్లడించింది. 

ఇక మాడపాటి సత్యవతి విషయానికి వస్తే..ఆల్ ఇండియా రేడియోలో తొలి మహిళా న్యూస్ రీడర్ కావడం విశేషం. రాష్ట్ర ప్రభుత్వం విశిష్ట మహిళా పురస్కారాన్ని ప్రకటించింది. నగర మొదటి మేయర్ మాడపాటి హనుమంతరావు మనువరాలు సత్యవతి. ఆలిండియా రేడియోలో సుదీర్ఘకాలం న్యూస్ ఎడిటర్‌గా పనిచేశారు. వార్తా వాహిని పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించేవారు.

Read More : FASTag లేకుండా..ORRపైకి వెళ్లారో..బాదుడే

క్లుప్తంగా..సూటిగా, భావయుక్తంగా వార్తలు వినిపించడం ఆమె ప్రత్యేకత. నిజాంకాలం నాటి రజాకార్ల అరాచకాలను ఆమె కళ్లారా చూశారు. తెలుగు భాషపై నిషేధం ఉన్న కాలంలోనే..హనుమంతరావు స్థాపించిన..తెలుగు బాలికల ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు. అనంతరం ఆలిండియా రేడియోలో న్యూస్ రీడర్‌గా పనిచేశారు.