కిడ్నాప్ వెనుక : కాళ్లు, చేతులు కట్టేశారు, బంధించారు – ప్రవీణ్ సోదరుడు

కిడ్నాప్ వెనుక : కాళ్లు, చేతులు కట్టేశారు, బంధించారు – ప్రవీణ్ సోదరుడు

Former Hockey Player And His Brothers Kidnap : తన సోదరులను కాళ్లు, చేతులు కట్టేసి బెడ్ రూంలో బంధించారని, లీగల్ గా వెళ్లకుండా..మిస్ కమ్యూనికేషన్ తో కిడ్నాప్ కు పాల్పడ్డారని, ఈ వ్యవహారంలో రాజకీయాలకు సంబంధం లేదని ప్రవీణ్ రావు బంధువు ప్రతాప్ వెల్లడించారు. ప్రవీణ్ రావు, అతని ఇద్దరి సోదరుల కిడ్నాప్ కథ సుఖాంతం అయ్యింది. ప్రవీణ్‌రావుతో పాటు ఆయన సోదరులు నవీన్‌రావు, సునీల్‌ రావును గుర్తు తెలియని దుండగులు రాత్రి కిడ్నాప్‌ చేశారు. మూడు వాహనాల్లో వచ్చిన దుండగులు… ముగ్గురిని ఆ వాహనాల్లోనే కిడ్నాప్‌ చేశారు. ఈ సందర్భంగా…ప్రతాప్ మీడియాతో మాట్లాడారు.

ఐటీ రైడ్ అని కొందరు తమ ఇంటికి వచ్చారని, ఇంట్లోకి రాగానే ఫోన్స్ అన్నీ లాక్కొన్నారని తెలిపారు. తన సోదరులను ఎక్కడకు తీసుకెళుతున్నారో తెలియదన్నారు. ఈ విషయాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ కవితకు తెలియచేయడం జరిగిందన్నారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలియచేయడం జరిగిందన్నారు. తాను మహబూబ్ నగర్ నుంచి రాత్రి హైదరాబాద్ కు వచ్చినట్లు, తన సోదరులను ఏదో ఒక ఫాం హౌస్ లో కూర్చొబెట్టి, కాళ్లు, చేతులు కట్టేశారన్నారు. ఐటీ అధికారులమని, వెంటనే సంతకం పెట్టాలని డిమాండ్ చేశారన్నారు. తాము చదివిన తర్వాత..సంతకం పెడుతామని తన సోదరులు చెప్పారని వెల్లడించారు.

కాగితాలను పరిశీలించగా..అగ్రిమెంట్స్, ఆళ్లగడ్డ అనే పేర్లు ఉన్నాయని తెలిపారు. తమ్ముడు కొన్ని సంతకాలు పెట్టి ఆపేశాడన్నారు. కొంత మ్యాటర్, కొన్ని ఖాళీ పేపర్లపై సంతకాలు చేయించుకున్నారన్నారు. ఏదైమైనా ఉంటే..మాట్లాడుకుందామని తాము కిడ్నాపర్లకు అప్పీల్ చేశామన్నారు. 50 ఎకరాల భూమి విషయంలో అన్ని సవ్యంగానే ఉన్నాయని వెల్లడించారు. ప్రవీణ్ రావు బ్యాంకులో ఉద్యోగం చేశాడని, తాము ఎవరి జోలికి వెళ్లమన్నారు. భూ వివాదాలో వాళ్లకు మాకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అనుమానితుల ఫొటోలను తమ వాళ్లు గుర్తించారన్నారు. తమకు అనుమానం ఉన్న వారిపై ఫిర్యాదు చేశామన్నారు.

అయితే ఈ ముగ్గురిని కిడ్నాప్‌ ఎవరు చేశారు, ఎందుకు చేశారన్న దానిపై కొంత ప్రచారం నడుస్తోంది. ముగ్గురి కిడ్నాప్‌నకు ల్యాండ్‌ వివాదాలే కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హఫీజ్‌పేటలోని కోట్ల విలువచేసే ల్యాండ్‌ కోసం కిడ్నాపైన ముగ్గురికి, మరికొంత మందికి మధ్య కొన్నాళ్లుగా వివాదం నడుస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రత్యర్థులు కిడ్నాప్‌ చేసి ఉంటారన్న ప్రచారం జరుగుతోంది.