Etela Rajender : ఈటల బృందానికి తప్పిన ప్రమాదం.. ఆలస్యంగా బయల్దేరిన విమానం

ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ బృందానికి ప్రమాదం తప్పింది. ఈటల ఢిల్లీ నుంచి వస్తున్న స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది.

Etela Rajender : ఈటల బృందానికి తప్పిన ప్రమాదం.. ఆలస్యంగా బయల్దేరిన విమానం

Former Minister Etela Rajender Team Escape From Spice Jet Flight Accident

Etela Rajender escape from Flight Accident : ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ బృందానికి ప్రమాదం తప్పింది. ఈటల ఢిల్లీ నుంచి వస్తున్న స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. పైలట్ అలెర్ట్ అవ్వడంతో పెను ప్రమాదం తప్పింది.

విమానం గాల్లోకి లేచే టైంలో పైలట్ అప్రమత్తమై సాంకేతిక సమస్యను గుర్తించాడు. దాంతో ఆలస్యంగా ఈటల బృందం విమానం బయల్దేరింది. విమానంలో తలెత్తిన సమస్యను పరిష్కరించడంతో గంటన్నర ఆలస్యంగా హైదరాబాద్‌కు ఈటల బృందం బయల్దేరింది. ఈటలతో పాటు స్పైస్ జెట్ విమానంలో ఎమ్మెల్యే రఘనందన్, వివేక్, ఏనుగు రవీందర్ రెడ్డి తో పాటు మొత్తం 184 మంది ఉన్నారు.

ఢిల్లీలో కేంద్ర మంత్రి ధర్మంద్ర ప్రధాన్ సమక్షంలో ఈటల రాజేందర్ బీజేపీలో చేరారు. ఈటలతో పాటు రమేశ్‌ రాథోడ్‌, రవీందర్‌రెడ్డి, అశ్వత్థామరెడ్డి, తుల ఉమ, ఓయూ జేఏసీ నేత‌లు బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డాను ఈటల బృందం మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌‌కు ఉదయం 10 గంటలకు చేరుకోవాల్సి ఉంది. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయానికి మొదటసారి ఈటల వెళ్లనున్నారు. బీజేపీ ముఖ్యనేతలతో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది.