Telangana : ఏపీ వదిలేస్తా..తెలంగాణకు వస్తా – జేసీ దివాకర్ రెడ్డి

పాత మిత్రులను, కాంగ్రెస్ నాయకులను కలుస్తుంటారు. వచ్చిన వ్యక్తి ఊరికే ఉండకుండా.. ముఖం మీద కొట్టినట్లుగా.. బాహాటంగానే నాలుగు మాటలు చెప్పి వెళ్తుంటారు జేసీ దివాకర్ రెడ్డి.

Telangana : ఏపీ వదిలేస్తా..తెలంగాణకు వస్తా – జేసీ దివాకర్ రెడ్డి

Jc Diwakar

JC Diwakar Reddy : జేసీ దివాకర్ రెడ్డి.. ఆయన ఎక్కడుంటే అక్కడ జోష్ ఉంటుంది. ఏది మాట్లాడినా.. వెటకారంగానే ఉంటుంది. కానీ.. అందులో కొంత కాంట్రవర్శీతో పాటు సెన్సేషన్ కూడా మిక్సై ఉంటుంది. జేసీ అనంతపురంలో ఉన్నా.. రాయలసీమ దాటినా.. ఏపీలో తిరిగినా.. తెలంగాణకు వచ్చినా.. హంగామా మాత్రం మామూలుగా ఉండదు. అదంతా.. ఆయన మాటల్లోనే ఉంటుంది. ఆయన చేసే కామెడీలోనే.. ఖతర్నాక్ పంచ్ పేలుతుంది.తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు జేసీ దివాకర్ రెడ్డి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ లీడర్‌కి.. తెలంగాణ అసెంబ్లీతో లింకేంటని అడగొద్దు. అప్పుడప్పుడు ఆయనలా వస్తుంటారు. పాత మిత్రులను, కాంగ్రెస్ నాయకులను కలుస్తుంటారు. వచ్చిన వ్యక్తి ఊరికే ఉండకుండా.. ముఖం మీద కొట్టినట్లుగా.. బాహాటంగానే నాలుగు మాటలు చెప్పి వెళ్తుంటారు. అవే.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారుతుంటాయ్. ఈసారి కూడా అదే జరిగింది.

Read More : JC Diwakar Reddy : ఏపీలో కంటే తెలంగాణలో పాలన భేష్, ఇక్కడే ఉంటే బాగుండేది – జేసీ

కేసీఆర్ ను కలిసిన జేసీ :- 
తెలంగాణ వదిలిపెట్టి తాము నష్టపోయమాని.. సీఎల్పీలోనూ ఆవేదన వ్యక్తం చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. తాను ఏపీ వదిలేసి.. తెలంగాణకు వస్తానని చెప్పారు.తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ను కలిశారు జేసీ దివాకర్ రెడ్డి. ముఖ్యమంత్రి అయ్యాక తాను కేసీఆర్‌ని కలవలేదని.. అందుకే కలుద్దామని వచ్చినట్లు చెప్పారు. సీఎం బాగోగులు అడిగి తెలుసుకున్నానన్నారు జేసీ. తర్వాత కేటీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ మీట్‌లోనే.. హీట్ పుట్టించే కామెంట్స్ చేశారు దివాకర్ రెడ్డి. ఏపీ కంటే తెలంగాణలో పాలన బాగుందని మెచ్చుకున్నారు. రాజకీయ అంశాలు పక్కనబెడితే.. తాను రాయల తెలంగాణ కోరుకున్నానని చెప్పారు జేసీ. రాష్ట్రం విడిపోయాక తాము నష్టపోయామని చెప్పారు జేసీ దివాకర్.

Read More : Vijay Deverakonda Mother : అమ్మకు ప్రేమతో అదిరిపోయే గిఫ్ట్..

తెలంగాణ వదిలిపెట్టి నష్టపోయాం :- 
రాయల తెలంగాణ ఏర్పడి ఉంటే.. అందరం బాగుండే వాళ్లమన్నారు. తర్వాత.. తన పాత కాంగ్రెస్ మిత్రులతో సీఎల్పీలో సమావేశమయ్యారు జేసీ దివాకర్ రెడ్డి. గతంలో జానారెడ్డి గెలవడం కష్టమని చెప్పాను.. గెలిచాడా అని ప్రశ్నించారు. జానారెడ్డి తనకు మంచి మిత్రుడని.. అయ్యో పాపం ఓడిపోతాడని బాధతో అన్నానని చెప్పారు. అయితే.. నాగార్జునసాగర్‌లో జానారెడ్డి ఎందుకు ఓడిపోయారనేది అందరికీ తెలుసన్నారు. రాజకీయాలు, సమాజం బాగోలేవని.. సర్ది చెప్పే ప్రయత్నం చేశారు జేసీ. హుజురాబాద్ ఎలక్షన్ గురించి మాత్రం తనకు తెలియదన్నారు. ఏదేమైనా.. తెలంగాణ వదిలిపెట్టి తాము నష్టపోయమాని.. సీఎల్పీలోనూ ఆవేదన వ్యక్తం చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి.

Read More : Delhi Court : కోర్టులో గ్యాంగ్‌‌స్టర్‌‌ల మధ్య కాల్పులు, జితేందర్ గోగి హతం

గత అసెంబ్లీ సమావేశాల్లో :-
గత అసెంబ్లీ సమావేశాలప్పుడు కూడా జేసీ.. హైదరాబాద్ వచ్చారు. సీఎల్పీ కార్యాలయంలో.. కాంగ్రెస్ నేతలను కలుసుకొని.. కాసేపు సరదాగా మాట్లాడారు. అప్పుడైతే.. ఏకంగా తెలంగాణలో కాంగ్రెస్ భవిష్యత్తు గురించి తన అభిప్రాయాన్ని ఏమాత్రం మొహమాటం లేకుండా చెప్పేశారు. అప్పుడే సాగర్ ఉపఎన్నికలో.. కాంగ్రెస్ ఓడిపోతుందని జోస్యం చెప్పారు. అదే నిజమైంది. తెలంగాణ ఇచ్చి కాంగ్రెస్ అక్కడా.. ఇక్కడా లేకుండా పోయిందన్నారు. సోనియా, రాహుల్ పైనా.. కాంట్రవర్శీ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ నేతలు ఏడుస్తూ కూర్చుంటే లాభం లేదని.. వేరే దారి చూసుకోవాల్సిన అవసరముందని.. సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు కాలం చెల్లిందని.. మరో రెండేళ్ల తర్వాత కాంగ్రెస్ సీనియర్ నేతలు వ్యవసాయం చేసుకోవాల్సిందేనన్నారు.