JC Diwakar Reddy : ఏపీలో కంటే తెలంగాణలో పాలన భేష్, ఇక్కడే ఉంటే బాగుండేది – జేసీ

రాష్ట్రం విడిపోయినా...మీరు బాగు పడ్డారు..తాము ఇక్కడే ఉంటే బాగుండేది... ఏపీలో కంటే తెలంగాణ రాష్ట్రంలో పాలన బాగుందని మెచ్చుకున్నారు మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి.

JC Diwakar Reddy : ఏపీలో కంటే తెలంగాణలో పాలన భేష్, ఇక్కడే ఉంటే బాగుండేది – జేసీ

Jc

JC Diwakar Reddy : రాష్ట్రం విడిపోయినా…మీరు బాగు పడ్డారు..తాము ఇక్కడే ఉంటే బాగుండేది… ఏపీలో కంటే తెలంగాణ రాష్ట్రంలో పాలన బాగుందని మెచ్చుకున్నారు మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి. 2021, సెప్టెంబర్ 24వ తేదీ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. సీఎల్పీ సమావేశం జరుగుతుండగా…జేసీ దివాకర రెడ్డి ప్రత్యక్షమయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో కాసేపు చిట్ చాట్ చేశారు. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారాయన. ముఖ్యమంత్రిగా కేసీఆర్ అయ్యాక..తాను కలువలేదని..అందుకే ఇక్కడకు రావడం జరిగిందన్నారు. తమకు అన్యాయం జరిగిందని, రాయలసీమ కూడా మీతో కలిసి ఉంటే బాగుండు అని అనడం జరిగిందన్నారు.

Read More : Air Pollution : హైదరాబాద్ లో పెరిగిపోతున్న గాలి కాలుష్యం..డేంజర్ జోన్ లో నగరం..!

మంత్రి కేటీఆర్ ను జేసీ దివాకర్ రెడ్డి కలిశారు. వీరిద్దరి భేటీలో ఆసక్తికర సంభాషణ జరిగింది. రాష్ట్రం విడిపోయినా…మీరు బాగు పడ్డారని, తాము ఇక్కడే ఉంటే బాగుండేది అనుకుంటున్నట్లు తెలిపారు. ఏపీలో కంటే తెలంగాణ రాష్ట్రంలో పాలన బాగుందని జేసీ మెచ్చుకున్నారు. రాష్ట్రం విడిపోయి తాము నష్టపోయామనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులపై హాట్ కామెంట్స్ చేశారు జేసీ.

Read More : Final Funerals : అంత్యక్రియలు అడ్డుకున్నస్ధానికులు…చితిపై కూర్చుని నిరసన

మొన్నటి ఎంపీ ఎన్నికల్లో ఒక్కొక్కరు రూ. 50 కోట్లు ఖర్చు చేశారని చెప్పిన ఆయన…అధికారంలో లేని వ్యక్తి..ఒక్కొక్క ఎమ్మెల్యే అభ్యర్థికి రూ. 15 నుంచి రూ. 20 కోట్లు ఇచ్చాడని సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్ నుంచి జగన్ కు కూడా డబ్బులు లారీల్లో వచ్చాయన్నారు. రాజకీయ నాయకుల్లో నీతి లోపించిందని, జనాలను తప్పుదోవ పట్టించేది నేతలే అన్నారు. తాను 1980లో సమితి ప్రెసిడెంట్ కి నిలబడితే…రూ. 10 వేలు ఖర్చు అయితే..ఇప్పుడు మొన్న ఎంపీ అభ్యర్థిగా నిలబడితే..రూ. 50 కోట్లు ఖర్చయ్యిందన్నారు. ఆంధ్రలో ఎమ్మెల్యే ఎన్నికల్లో ఒక్క సీటుకు రూ. 4 వేలు నుంచి రూ. 5 వేలు ఖర్చు అవుతోందన్నారు జేసీ. ఏపీలో ఇటీవలే జరిగిన లోకల్ బాడీ రిజల్ట్స్ పై ఆయన స్పందించారు. తనకు ఎలాంటి ఆశ్చర్యం కలిగించలేదని..అందులో ఏం లేదన్నారు.