T.Congress MLA’s : ప్రగతి భవన్‌‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ చర్చలు

తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పై ఒంటి కాలిపై నిలిచే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాఠాత్తుగా సీఎం కేసీఆర్ ను కలిసేందుకు ప్రగతి భవన్ కు రావడం పొలిటికల్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత..మొదటిసారి కాంగ్రెస్ నేతలకు అపాయింట్ మెంట్ ఇవ్వడమే.

T.Congress MLA’s : ప్రగతి భవన్‌‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ చర్చలు

Pragathi

Mariyamma Lockup Death : రాష్ట్రంలో ప్రతిపక్షం, అధికార పక్షం మధ్య ఎప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంటుంది. ఎప్పుడో ఒకసారి..వీరి మధ్య స్నేహపూరిత వాతావరణం వస్తూ ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పై ఒంటి కాలిపై నిలిచే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాఠాత్తుగా సీఎం కేసీఆర్ ను కలిసేందుకు ప్రగతి భవన్ కు రావడం పొలిటికల్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఎందుకంటే..తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత..మొదటిసారి కాంగ్రెస్ నేతలకు అపాయింట్ మెంట్ ఇవ్వడమే.

నేరేళ్ల ఘటనలో సీఎం అపాయింట్ మెంట్ కోరినా..అప్పుడు లభించలేదనే సంగతి తెలిసిందే. హాఠాత్తుగా సీఎల్పీ బృందం ప్రగతి భవన్ లో ప్రత్యక్షం కావడం..సంచలనంగా మారింది. ఎన్నిసార్లు అసెంబ్లీలో అపాయింట్ మెంట్ కోరినా…పట్టించుకోని సీఎం కేసీఆర్ ఇప్పుడు ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది. మరియమ్మ లాకప్ డెత్ విషయంలో అపాయింట్ మెంట్ కోరగా..ఆయన ఇచ్చారు. సీఎం కేసీఆర్ ను కలిసిన వారిలో మల్లు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, రాజ్ గోపాల్ రెడ్డిలున్నారు.

మరియమ్మ లాకప్ డెత్ విషయంలో చర్చించడం కోసం సీఎం అపాయింట్ మెంట్ కోరారని, దీనికి సీఎం అనుమతినివ్వడంతో ప్రగతి భవన్ కు నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వచ్చారని సమాచారం. అయితే..అక్కడ ఎలాంటి చర్చ జరుగుతుందనేది తెలియరావడం లేదు. ఈటల రాజేందర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన అనంతరం తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. హుజూరాబాద్ ఎన్నికలు త్వరలో ఉండడం, ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ ఎంపికపై హై కమాండ్ దృష్టి సారించిన నేపథ్యంలో..కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ కలవడంపై చర్చ జరగుతోంది.

ప్రతిపక్షాలపై సీఎం కేసీఆర్ వైఖరి మారిందా అనే చర్చ జరుగుతోంది. దీనిపై బీజేపీ నేత రఘునందన్ తీవ్ర విమర్శలు చేశారు. చాలా సందర్భాల్లో అపాయింట్ మెంట్ కోరినా..ఇవ్వలేదని వెల్లడిస్తున్నారు. హుజూరాబాద్ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కలిసి పనిచేయాలనే అభిప్రాయంతో ఉన్నాయని ఆరోపిస్తున్నారు.