Nagar Kurnool Accident : పండుగ పూట విషాదం.. నాగర్ కర్నూల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

వేగంగా వెళ్తోన్న కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.

Nagar Kurnool Accident : పండుగ పూట విషాదం.. నాగర్ కర్నూల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

Road Accident

Four killed in road accident : పండుగ పూట విషాదం నెలకొంది. నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తోన్న కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.

ఈ ఘటన చారకొండ మండలం తుర్కపల్లి వద్ద చోటు చేసుకుంది. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. మృతి చెందినవారంతా నల్గొండ జిల్లా నేరేడుచెర్లకు చెందిన వారిగా గుర్తించారు.

Road Accident: అనంతపురంలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి!

సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు. కారులో చిక్కుకుపోయిన వారిని బయటికి తీసేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్నారు. క్షతగాత్రులను చికిత్స కోసం వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.