Four CMs Reached Yadadri : యాదాద్రి చేరుకున్న సీఎం కేసీఆర్ సహా నలుగురు సీఎంలు.. ఘన స్వాగతం పలికిన ఆలయ అర్చకులు, అధికారులు

తెలంగాణ సీఎం కేసీఆర్ తోపాటు మూడు రాష్ట్రాల సీఎంలు యాదాద్రి చేరుకున్నారు. సీఎం కేసీఆర్ తోపాటుఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, చేరుకున్నారు. రెండు చాపర్లలో నలుగురు సీఎంలు యాదాద్రికి చేరుకున్నారు.

Four CMs Reached Yadadri : యాదాద్రి చేరుకున్న సీఎం కేసీఆర్ సహా నలుగురు సీఎంలు.. ఘన స్వాగతం పలికిన ఆలయ అర్చకులు, అధికారులు

Four CMs Reached Yadadri : తెలంగాణ సీఎం కేసీఆర్ తోపాటు మూడు రాష్ట్రాల సీఎంలు యాదాద్రి చేరుకున్నారు. సీఎం కేసీఆర్ తోపాటుఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, చేరుకున్నారు. రెండు చాపర్లలో నలుగురు సీఎంలు యాదాద్రికి చేరుకున్నారు. వారికి ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. చాపర్ 1లో సీఎం కేసీఆర్, కేరళ సీఎం పినరయి విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ ఎంపీ సంతోష్, ఎమ్మెల్సీ కవిత యాదాద్రికి వెళ్లారు. చాపర్ 2లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సింగ్ భగవంత్ సింగ్ మాన్, సీపీఐ జాతీయ నేత డి.రాజా, మంత్రులు ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు యాదాద్రికి వెళ్లారు. వీవీఐపీలు కావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు.

ప్రత్యేక పూజల కోసం ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. సాధారణ వ్యక్తులను గుట్టపైకి ఎవరినీ అనుమతించడం లేదు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత గుడి ప్రాంగణాన్ని పరిశీలించనున్నారు. గుడి చట్టూ కలియతిరిగే అవకాశం ఉంది. అనంతరం రెండు ప్రత్యేక హెలికాప్టర్లలో సీఎం కేసీఆర్ పాటు మూడు రాష్ట్రాల సీఎంలు, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, జాతీయ నేతలు మధ్యాహ్నం 1 గంటకు నూతన సమీకృత కలెక్టర్ భవన ప్రారంభోత్సవానికి ఖమ్మం చేరుకుంటారు. అక్కడే కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. జాతీయ నేతల చేతుల మీదుగా ఆరుగురు లబ్ధిదారులకు కళ్ల జోడులు అందజేస్తారు. భోజనం అనంతరం ఖమ్మంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఆవిర్భావ భహిరంగ సభకు హాజరవుతారు.

BRS Avirbhava Sabha : నేడు ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ.. హాజరుకానున్న ఢిల్లీ, కేరళ, పంజాబ్ సీఎంలు

బీఆర్ఎస్ సభ సందర్భంగా ఖమ్మం మొత్తం గులాబీమయం అయింది. ఖమ్మ నగరం చుట్టూ ఐదు కిలో మీటర్ల వరకు గులాబీ తోరణాలు, భారీ కటౌట్లు, హోర్డింగ్స్, ఫ్లెక్సీలతో ముస్తాబు చేశారు. బహింగ సభ కోసం బీఆర్ ఎస్ ముఖ్యనేతలు ఖమ్మం బాట పట్టారు. మరోవైపు ఈ సభకు పెద్ద ఎత్తున జనం కూడా వస్తుండంతో అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారు. ఖమ్మ-వైరా రహదారిపై వెంకటాయిపాలెం సమీపంలో వంద ఎకరాల్లో సభను నిర్వహిస్తుండగా ప్రధాని వేదికను జపాన్ సాంకేతిక పరిజ్ఞానంతో తీర్చిదిద్దారు. వేదికపై సీఎం కేసీఆర్ తోపాటు కేజ్రీవాల్, పినరయి విజయన్, భగవంత్ మాన్ సింగ్, అఖిలేశ్ యాదవ్, డి.రాజా చిత్ర పటాలతో కూడిన ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికపై వీరితో పాటు ఖమ్మం జిల్లా నేతలకు చోటు కల్పించినట్లు తెలుస్తోంది.

మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు ప్రధాన నేతలకు వేదికకు ఎదురుగా కుర్చీలు ఏర్పాటు చేశారు. మహిళలు, పురుషులకు వేర్వేరుగా సుమారు 75 వేలకుపైగా కుర్చీలు సిద్దం చేశారు. ప్రధాన నేతల ప్రసంగాలను వీక్షించేందుకు ప్రాంగణంలో 50 ఎల్ ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఖమ్మం సభ ద్వారా బీజేపీయేతర పక్షాల ఐక్యత సంకేతాలు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన పలు రాష్ట్రాలను సందర్శించి విపక్ష ప్రభుత్వాల సీఎంలు, నేతలతో భేటీ అయ్యారు. ఇతర రాష్ట్రాల సీఎంల ప్రసంగాల అనంతరం కేసీఆర్ తన సందేశం ఇవ్వనున్నారు. పార్టీ ఏర్పాటు నేపథ్యం, 75 ఏళ్ల భారతావని దుస్థితి, వనరుల నిరుపయోగం తదితర అంశాలపై ఆయన ప్రసంగించే అవకాశం ఉంది. జాతీయ పార్టీ విధి విధాలను ప్రకటించనున్నారు.