Cabinet: హైదారాబాద్‌లో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు

జీహెచ్ఎంసీ పరిధిలో గ‌చ్చిబౌలిలో ఇప్పుడున్న టిమ్స్ హాస్పిటల్‌ను ప్రజా అవసరాలకు అనుగుణంగా మార్పులు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

Cabinet: హైదారాబాద్‌లో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు

Telangana (1)

GHMC Hospitals: జీహెచ్ఎంసీ పరిధిలో గ‌చ్చిబౌలిలో ఇప్పుడున్న టిమ్స్ హాస్పిటల్‌ను ప్రజా అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసి, దానిని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌గా అధునీకరించాలని, దానికి తోడుగా ఇంకా మరో మూడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించాలని, మొత్తం నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేసేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

కొత్త‌గా నిర్మించే మూడు సూప‌ర్ స్పెషాలిటీ హాస్పిట‌ల్స్‌ను చెస్ట్ హాస్పిట‌ల్ ప్రాంగ‌ణంలో ఒకటి, ఈ మధ్యనే గడ్డి అన్నారం నుంచి షిప్టు చేసిన ప్రూట్ మార్కెట్ ప్రాంగణంలో రెండోది, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో అల్వాల్ నుంచి ఓఆర్‌ఆర్‌ మధ్యలో మూడో దాన్ని నిర్మించ‌నున్నారు.

అలాగే, కొత్త‌పేట‌లో ప్ర‌స్తుతం ఉన్న కూర‌గాయల మార్కెట్‌ను పూర్తిగా ఆధునీకరించి ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్‌గా మార్చాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. దీనికి కేబినెట్ ఆమోదం తెలిపింది.