Warangal : డబ్బుల కోసం నాలుగేళ్ల బాలుడిని అమ్మిన తండ్రి!

కుటుంబ సభ్యులకు తెలియకుండా తండ్రి ఇతరులకు పెంపకం కోసం ఎలా ఇస్తారనే అనుమానాలు కలుగుతున్నాయి. డబ్బులకు ఆశపడి ఇలాంటి దారుణానికి పాల్పడి ఉండవచ్చని ప్రచారం సాగుతోంది.

Warangal : డబ్బుల కోసం నాలుగేళ్ల బాలుడిని అమ్మిన తండ్రి!

boy sold

Boy Sold : వరంగల్ లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. డబ్బుల కోసం కొడుకును తండ్రి అమ్మేశాడన్న విషయం కలకలం రేగింది. నాలుగేళ్ల బాలుడిని కన్నతండ్రే అమ్మేశాడని ప్రచారం జరుగుతోంది. కరీమాబాద్ కు చెందిన మసూద్ నాలుగేళ్ల కుమారుడు అయాన్ ను అమ్మాడని అదే ప్రాంతానికి చెందిన అతడి బావమరిది అక్బర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సదరు బాలుడి అమ్మకం వెలుగు చూసింది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తండ్రి మసూద్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.  అయితే తన కొడుకును అమ్మలేదని, పోచమ్మమైదాన్ లో ఉన్న కుటుంబ సభ్యులకు పెంపకం కోసం ఇచ్చానని మసూద్ చెబుతున్నట్లు సీఐ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. కాగా, ఈ కేసు మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ నుంచి మట్టెవాడ పోలీస్ స్టేషన్ కు బదిలీ అయినట్లు తెలుస్తోంది.

Atchutapuram Lodge : రక్తపు మడుగులో యువతి, గదిలో ఇంజెక్షన్-నీడిల్స్.. అచ్యుతాపురం లాడ్జిలో అసలేం జరిగింది?

కుటుంబ సభ్యులకు తెలియకుండా తండ్రి ఇతరులకు పెంపకం కోసం ఎలా ఇస్తారనే అనుమానాలు కలుగుతున్నాయి. డబ్బులకు ఆశపడి ఇలాంటి దారుణానికి పాల్పడి ఉండవచ్చని ప్రచారం సాగుతోంది. అలాగే అతను పిల్లలను పట్టుకునే ముఠా సభ్యులకు డబ్బుల కోసం అమ్మి ఉండవచ్చనే అనుమాలు వ్యక్తం అవుతున్నాయి.

అయితే బాలుడిని పిల్లలను ఎత్తుకెళ్లే ముఠాకు అప్పజెప్పారా? లేదా సంతానం లేని వాళ్లు పెంపకం కోసం తీసుకున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై లోతుగా విచారించాలని పోలీసులకు సీపీ ఆదేశించినట్లు తెలుస్తోంది.