Foxconn invest: తెలంగాణలో ఫాక్స్‌కాన్ భారీ పెట్టుబడి.. ఎయిర్‌పాడ్ల తయారీ కేంద్రం ఏర్పాటు యోచన

ఇప్పటి వరకు ఐఫోన్లు సహా పలు రకాల సెమికండక్టర్లు తయారు చేస్తున్న ఫాక్స్‌కాన్ ఇకనుంచి ఎయిర్ పాడ్లు కూడా తయారు చేయనుంది. ఎయిర్ పాడ్లను చైనా కంపెనీలు తయారు చేస్తుండగా, చైనా నుంచి తయారీని ఇతర దేశాల్లో విస్తరించాలన్న లక్ష్యంలో యాపిల్ ఉండగా, అందుకు సంబంధించిన కాంట్రాక్ట్‌ను ఫాక్స్‌కాన్ చేజిక్కించుకుంది. ఇందుకు సంబంధించిన తయారీ కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయాలని ఫాక్స్‌కాన్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Foxconn invest: తెలంగాణలో ఫాక్స్‌కాన్ భారీ పెట్టుబడి.. ఎయిర్‌పాడ్ల తయారీ కేంద్రం ఏర్పాటు యోచన

Foxconn

Foxconn invest: ప్రపంచంలోనే అతిపెద్ద కాంట్రాక్ట్ ఎలక్ట్రానిక్స్ తయారీదారు, యాపిల్‌కు అతిపెద్ద సరఫరాదారు ఫాక్స్‌కాన్ మొదటి సారిగా ఎయిర్‌పాడ్ల (AirPod) లను తయారు చేయనుంది. వైర్‌లెస్ ఇయర్ ఫోన్‌లను తయారు చేయడానికి ఇండియాలో తయారీ కేంద్రాన్ని నిర్మించాలని యోచిస్తోంది. ఇందుకోసం ఫాక్స్‌కాన్ తెలంగాణలో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తోన్నట్లు రాయిటర్స్ నివేదిక పేర్కొంది. అన్ని అనుకూలిస్తే 2023 ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో నిర్మాణాన్ని ప్రారంభించడమే కాకుండా, 2024 సంవత్సరం చివరి నాటికి ఉత్పత్తిని ప్రారంభించాలని తైవానీస్ కాంట్రాక్ట్ తయారీదారు ఫాక్స్‌కాన్ యోచిస్తోన్నట్లు రాయిటర్స్ పేర్కొంది.

iPhone Maker Foxconn In Telangana: అందరి దృష్టీ ఇప్పుడు తెలంగాణపైనే.. ఏమిటీ ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్?

ఇప్పటి వరకు ఐఫోన్లు సహా పలు రకాల సెమికండక్టర్లు తయారు చేస్తున్న ఫాక్స్‌కాన్ ఇకనుంచి ఎయిర్ పాడ్లు కూడా తయారు చేయనుంది. ఎయిర్ పాడ్లను చైనా కంపెనీలు తయారు చేస్తుండగా, చైనా నుంచి తయారీని ఇతర దేశాల్లో విస్తరించాలన్న లక్ష్యంలో యాపిల్ ఉండగా, అందుకు సంబంధించిన కాంట్రాక్ట్‌ను ఫాక్స్‌కాన్ చేజిక్కించుకుంది. మొత్తం యాపిల్ ఫోన్లలో 70శాతం ఫాక్స్‌కాన్ కంపెనీయే తయారుచేసి సరఫరా చేస్తుంది. ఇందులో భాగంగా ఎయిర్ పాడ్ల ఉత్పత్తి బాధ్యతను ఫాక్స్‌కాన్ చేపట్టింది. దీని విలువ 200 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 1700 కోట్లు). అయితే, ఎయిర్ పాడ్ల తయారీకి సంబంధించి కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు ఫాక్స్‌కాన్ సిద్ధమైంది. ఇప్పటికే సంస్థ చైర్మన్ నేతృత్వంలోని కంపెనీ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఇటీవలే హైదరాబాద్ లో సీఎం కేసీఆర్ తో సమావేశమై రాష్ట్రంలో భారీ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. కంపెనీ కోరిక మేరకు రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్ లో పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Foxconn Chairman Letter CM KCR : సీఎం కేసీఆర్ కు ఫాక్స్ కాన్ ఛైర్మన్ లేఖ.. ‘కొంగరకలాన్‌లో ప్లాంట్ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నాం’

ఫాక్స్‌కాన్ చైర్మన్ యంగ్ లియు తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న నెల రోజుల్లోపే తాజా పరిణామం చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లాలో 200 ఎకరాల స్థలంకోసం తెలంగాణ ప్రభుత్వంతో ఫాక్స్‌కాన్ సంస్థ చర్చలు జరుపుతోందని రాయిటర్స్ నివేదిక పేర్కొంది. ఈ ప్రాంతంలోనే యాపిల్ నుంచి ఎయిర్ పాడ్ల తయారీ ఆర్డర్‌ను దక్కించుకున్న ఫాక్స్‌కాన్ ఈ ప్రాంతంలోనే తయారీ కేంద్రాన్ని నిర్మించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.  ఇదిలాఉంటే, ప్రస్తుతం భారత్‌లోని చెన్నైలో ఫోన్ల తయారీ కేంద్రాన్ని నిర్మిస్తున్న ఫాక్స్‌కాన్ భారత్‌లోని ఇతర ప్రాంతాలకుకూడా విస్తరించాలని నిర్ణయించింది.