Free power: తెలంగాణలో ఉచిత విద్యుత్ కోసం దరఖాస్తు చేసుకోండి

తెలంగాణ రాష్ట్రంలో సెలూన్లకు, లాండ్రీలకు విద్యుత్ ఉచితంగా ఇవ్వనుండగా.. అర్హులైన నాయీ బ్రాహ్మణులు, రజకులు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.

Free power: తెలంగాణలో ఉచిత విద్యుత్ కోసం దరఖాస్తు చేసుకోండి

Free Electricity Telangana

Apply for free electricity: తెలంగాణ రాష్ట్రంలో సెలూన్లకు, లాండ్రీలకు విద్యుత్ ఉచితంగా ఇవ్వనుండగా.. అర్హులైన నాయీ బ్రాహ్మణులు, రజకులు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. రాష్ట్రంలో 250 యూనిట్ల విద్యుత్‌ వరకు సెలూన్లు, లాండ్రీల్లో ఫ్రీగా ఇచ్చేందుకు ప్రభుత్వం కార్యాచరణ మొదలెట్టగా.. అందుకు అర్హులైన నాయీ బ్రాహ్మణులు, రజకులు దరఖాస్తు చేసుకోవాలని హైదరాబాద్‌ జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి అధికారి జి.ఆశన్న ప్రకటనలో తెలిపారు.

అర్హత కలిగిన లబ్ధిదారులకు ఏప్రిల్‌ ఒకటవ తేదీ నుంచి ఉచిత విద్యుత్‌ పొందే అవకాశం ఉన్నట్లుగా ప్రభుత్వం చెబుతుంది. అర్హత కలిగిన లబ్ధిదారులు బీసీ సంక్షేమ సంఘం శాఖలోని CGG ఆన్‌లైన్‌ పోర్టల్‌లోని TS OBMMS www.tsobmms.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. తహసీల్దార్‌చే జారీ చేయబడిన కులం పత్రం, లేబర్‌ లైసెన్స్‌, సెలూన్‌, లాండ్రీ ఫొటోలను అప్‌లోడ్ చెయ్యడం ద్వారా ఉచిత విద్యుత్మ పొందవచ్చునని చెబుతున్నారు.

విద్యుత్‌ కనెక్షన్లు లబ్ధిదారుల పేరిట మాత్రమే ఉండాలని, విద్యుత్‌ వినియోగం 250 యూనిట్లు దాటితే మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారుడే చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు అధికారులు.