ఫస్ట్ ఇయర్ కానుక : హైదరాబాద్‌లో ఫ్రీ వాటర్, ఆధార్ తప్పనిసరి

  • Published By: madhu ,Published On : December 13, 2020 / 01:50 PM IST
ఫస్ట్ ఇయర్ కానుక : హైదరాబాద్‌లో ఫ్రీ వాటర్, ఆధార్ తప్పనిసరి

Free Water in Hyderabad : నూతన సంవత్సరం కానుకగా హైదరాబాద్‌లో ఫ్రీ వాటర్ అందించడానికి రంగం సిద్ధమైంది. జనవరి ఫస్ట్‌ నుంచి దీన్ని అమలు చేసేందుకు వాటర్ బోర్డు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అయితే ఉచిత తాగు నీరు అందాలంటే క్యాన్ నెంబర్‌కు ఆధార్ అనుసంధానం చేయాల్సి ఉంటుంది. గ్రేటర్ పరిధిలో ప్రతి ఇంటికి 20వేల లీటర్ల నీటిని అందజేస్తామని హామి ఇచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్. దీంతో మున్సిపల్ అడ్మినిష్ట్రేసన్ విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. అందుకు అనుగుణంగా అధికారులు చర్యలు ప్రారంభించారు.

ఆధార్‌తో లింకు :-
ప్రతి ఇంటికి ఉచితంగా తాగునీరు సరఫరా చేసేందుకు ప్రభుత్వం ఆధార్‌తో లింకు పెట్టింది. ఇప్పటికే ఉన్న నల్లా కనెక్షన్ కన్జ్యూమర్ అకౌంట్ నెంబర్‌కు ఆధార్ అనుసంధానం చేయాల్సి ఉంటుంది. ఆధార్ యాక్టు సెక్షన్ 7ప్రకారం సబ్సిడీలు ఆర్థిక ప్రయోజనం కలిగే అంశాలకు ఆధార్‌ తప్పనిసరి. అందుకు తగ్గట్లుగానే ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆధార్‌తో పాటు ఫోటో ఐడెంటిఫికేషన్ కలిగిన బ్యాంకు పాస్ బుక్… లేదా పోస్టాఫీస్ పాస్ బుక్, పాన్ కార్డు, పాస్ పోర్టు, రేషన్ కార్డు, ఓటర్ కార్డు, ఎంజి నరేగా కార్డు, కిసాన్ పాస్ బుక్, డ్రైవింగ్ లైసెన్స్, తహసిల్దార్, లేదా గెజిటెడ్ అధికారి తమ లెటర్ హెడ్‌పై చేసిన ధృవీకరణ పత్రాలలో ఏదో ఒకటి జతచేయాల్సి ఉంటుంది. అయితే ఇందులో సివరేజ్ సెస్ విషయంలో స్పష్టత ఇవ్వలేదు. అంటే బిల్లులో 30 శాతంగా ఉంటుంది.

20 వేల లీటర్ల నీటి పంపిణీ :-
వాటర్ బోర్డు పరిధిలోని జీహెచ్ఎంసీ, మున్సిపల్ కార్పోరేషన్లు, మున్సిపాలిటిల్లోనూ మొదటి 20వేల లీటర్ల నీటి పంపిణీకి ఫ్రీవాటర్ వర్తించనుంది. ఒక ఇల్లు కంటే ఎక్కువ ఇండ్లు ఉంటే ఈ ఫథకం వాటికి వర్తిస్తుందా లేదా అన్న అంశంపై మాత్రం క్లారీటి లేదు. నగరంతో పాటు చుట్టూ ఉండే కార్పోరేషన్లు.., మున్సిపాలీటిల్లో కూడా పెద్ద సంఖ్యలో అపార్టుమెంట్లు ఉన్నాయి. అపార్ట్‌మెంట్‌లోని అన్ని ప్లాట్లకు కలపి ఒక్కటి లేదా రెండు నల్లా కనెక్షన్లు ఉంటాయి. అలాంటి వాటికి ఈ పథకం ఎలా వర్తింప చేస్తారన్నది సందేహంగా మారింది. ఫ్రీవాటర్‌పై జీవో విడుదల కావడంతో అధికారులు కార్యచరణపై ఫోకస్ పెట్టారు. ఈ నెలలో అన్ని ఫార్మాలీటిస్ పూర్తి చేసి- నూతన సంవత్సర కానుకగా హైదరాబాద్‌లో ఉచితి నీటి పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది జలమండలి.